బిజినెస్

సరికొత్త ఇన్ హేలర్‌ను ప్రవేశపెట్టిన సిప్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఔషధ తయారీ సంస్థ ‘సిప్లా’ శుక్రవారం కొత్తగా ‘నెవీ ఆయిల్ ఇన్‌హేలర్’ను మనదేశ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ప్రోప్రియేటరీ రెస్పిరేటరీ ఇన్హలేషన్ ధెరపీకి ఈ నెవీ ఆయిల్ ఇన్‌హేలర్ ఉపయుక్తంగా ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.
ఆస్తమా, క్రానిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసార్డర్ (సీఓపీడీ) వంటి రోగాలకు నిర్వహించే ఉచ్వాస నిశ్వాసాల ఇన్‌హెలేషన్ థెరపీల్లో ఈ నివీఆయిల్ వినియోగించవచ్చని సిప్లా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. పెద్దలకోసం నివీఆయిల్, ఎక్ట్స్రా ఫైన్ పార్టికల్ బికామ్‌తెసోన్ ఫార్మోటరల్ కాంబినేషన్‌తో వచ్చే హైడ్రోఫ్లూరోల్కన్ (హెచ్‌ఎఫ్‌ఎ) ఇన్‌హేలర్‌ను ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందని కంపెనీ తెలిపింది. మనదేశంలోని పరిశోధన, అభివృద్ధి రంగంలో ఈ ఔషదం ఓ విశిష్టతను కలిగివుంటుందని సిప్లా ఇండియా వాణిజ్య విభాగం అధిపతి నిఖిల్‌చోప్రా తెలిపారు. కాగా సిప్లాకు చెందిన వాటాలు శుక్రవారం 0.40 లాభపడి ఒక్కోవాటా 546.55 రూపాయలు ట్రైడయ్యాయి.