బిజినెస్

ద్వారకా ఎక్స్‌ప్రెస్ మార్గంలో చినె్టల్స్ హౌసింగ్ ప్రాజెక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గుర్‌గావ్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస్ మారంలో గృహ నిర్మాణాలపై రియాల్టీ సంస్థ చినె్టల్స్ దృష్టి సాధించింది. వచ్చే ఐదేళ్ల కాలంలో, ఈ ప్రాంతంలో 307 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇళ్లను నిర్మిస్తామని చినె్టల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ సాలమన్ తెలిపారు. రెండో దశ నిర్మాణాలకు 324 గృహాలను నిర్మిస్తామన్నారు. తమ సంస్థ తొలి విడతగా 155 కోట్ల రూపాయల వ్యయంతో 120 గృహాలను నిర్మించిందని వివరించారు. అదే విధంగా రెండో విడతగా 324 యూనిట్ల నిర్మాణం జరుగుతామని పేర్కొన్నారు. ఢిల్లీ, గుర్‌గావ్ మధ్య ద్వారకా ఎక్స్‌ప్రెస్ మార్గ నిర్మాణంలో జాప్యం జరుతున్నదని, ఫలితంగా రెండో విడత నిర్మాణాలను తాము ఇంకా చేపట్టలేదని వివరించారు. అయితే, త్వరలోనే మొదలుపెట్టి, 2023 సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్)కి కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్న సాలమన్ అన్నారు. నివాస యోగ్యమైన ఇళ్లతోపాటు, వాణిజ్య సముదాయాలను కూడా నిర్మిస్తామని వివరించారు. ఇంటర్నేషనల్ సిటీ పేరుతో 168 ఎకరాల్లో టౌన్‌షిప్‌ను నిర్మిస్తామని తెలిపారు.