బిజినెస్

డెన్మార్క్‌తో ఒప్పందానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పునరుద్పాదక విద్యుత్ తయారీకి సంబంధించి డెన్మార్క్‌తో కుదిరిన ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే ఈ రెండు దేశాల ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు కూడా జరిగాయి. సముద్ర తీరాలకు దూరంగా, గాలిమరల ఆధారంతో విద్యుత్‌ను తయారు చేయడంపై భారత్, డెన్మార్క్ పరస్పర సహకారాలను ఇచ్చి పుచ్చుకోవాలని ఆ అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ దేశాలకు చెందిన కొత్త, పునరుద్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన ఒప్పందానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర సమాచార శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వ్యూహాత్మక ఒమప్పందంలో భాగంగా, ఇరు దేశాలు తీరానికి దూరంగా వాయు విద్యుత్ తయారీకి సహకరించుకుంటాయి. అదే విధంగా భారత్‌లో పునరుద్పాదక విద్యుత్ రంగంలో ఇండో-డానిష్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి కూడా అంగీకారం కుదిరింది. ఎక్కువకాలం పని చేసే, విండ్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేసుకొని, అన్ని రకాల చర్యలు తీసుకుంటారు.