బిజినెస్

మిత్సుయి చేతికి రిల్ సంస్థల వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ సంస్థ ఈథేన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఈహెచ్‌పీఎల్) నిర్వహిస్తున్న ఆరు సంస్థల వాటాలను జపాన్‌కు చెందిన మిత్సు యి ఓఎస్‌కే లైన్స్ (ఎంఓఎల్)కు విక్రయించనుంది. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తన అనుబంధ సంస్థ రిలయన్స్ ఈథేన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎంఓఎల్‌తో పాటు మరో వ్యూహాత్మక మైనారిటి ఇనె్వస్టర్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పం దం కుదిరిందని రిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందం ప్రకారం, ఆర్‌ఈహెచ్‌పీఎల్ నిర్వహిస్తున్న ఆరు లిమిటెడ్ లయబిలిటి కంపెనీలలో ఈ పెట్టుబడులు పెడతాయి. అయితే ఈ ఒప్పందంలోని ఆర్థికాంశాలను రిల్ వెల్లడించలేదు. ‘నియంత్రణ సంస్థ ఆమోదం తరువాతే ఈ లావాదేవీ పూర్తవుతుంది. లావాదేవీ పూర్తయిన తరువాత ఆర్‌ఈహెచ్‌పీఎల్‌కు ఉన్న స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్‌పీవీలను) ఆర్‌ఈహెచ్‌పీఎల్, ఎంఓఎల్ సంయుక్తంగా నియంత్రిస్తాయి’ అని ఆ ప్రకటన వివరించింది. రిలయన్స్ పశ్చిమ భారతంలోని తన పెట్రోకెమికల్ ప్లాంట్లలో ఫీడ్‌స్టాక్‌గా సహజ వాయువు, నాఫ్తాకు బదులు ఉపయోగించడానికి అమెరికా నుంచి 1.6 మిలియన్ టన్నుల ఈథేన్‌ను దిగుమతి చేసుకుంటోంది. గ్యాస్ రెవల్యూషన్ తరువాత ఉత్తర అమెరికాలో ఈథేన్ పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతోంది. ఈథేన్‌ను ఉపయోగించడం వల్ల కంపెనీ ఫీడ్‌స్టాక్ వ్యయం సుమారు 30 శాతం వరకు తగ్గింది. జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీ మిత్సుయి ఓఎస్‌కే లైన్స్.. రిల్ కోసం ఓడలను నిర్వహిస్తుంటుంది.