బిజినెస్

నష్టాల్లో రాలీస్ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: వ్యవసాయోత్పత్తుల్లో పెరుపొందిన ర్యాలీస్ ఇండియా కంపెనీ షేర్లు భారత స్టాక్ మార్కెట్‌లో నష్టాల్లో ట్రేడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నికర లాభం 93 శాతం పడిపోయిందని ఈ కంపెనీ బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. దీనితో కంపెనీ షేర్లు సగటున 5 శాతం నష్టాలను చవిచూశాయి. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్ ధర 4.86 పడిపోయి, 149.55 రూపాయలకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో షేర్ ధర 5.41 శాతం పతనమై 149.25 రూపాయల వద్ద ముగిసింది. అటు బీఎస్‌ఈలో, ఇటు ఎన్‌ఎస్‌ఈలో స్టాక్ బ్రోకర్లకు అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమ్మకాలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం 19.58 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకు ముందు లాభాలతో పోలిస్తే ఇది 93 శాతం తక్కువ.
‘పరిమళ్’ లాభం రూ. 456 కోట్లు
పరిమళ్ ఎంటర్‌ప్రైజెస్ గత ఆర్థిక సంవత్సరం, చివరి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జనవరి ఒకటి నుంచి మార్చి 31వ తేదీ వరకూ ఉన్న ఈకాలంలో కంపెనీ 456.24 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో నిరక లాభం 3,943.98 కోట్ల రూపాయలుగా సెబీకి దాఖలు చేసిన ఫైలింగ్‌లో కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఈ కంపెనీ 3,569.18 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. అయితే, వివిధ అనుబంధ కంపెనీల లాభాలను కూడా ఒకే చోట చేర్చినట్టు పరిమళ్ ఎంటర్‌ప్రైజెస్ వివరించింది.
టాటా స్టీల్ దూకుడును ప్రదర్శించింది. ఈ కంపెనీ షేర్లు శుక్రవారం ఏకంగా 7 శాతం లాభాలను ఆర్జించాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో లాభాల్లో తగ్గుదలను సెబీకి సమర్పించిన ఫైలింగ్‌లో టాటా స్టీల్ ప్రకటించింది. అయినప్పటికీ, కంపెనీ షేర్లకు డిమాండ్ పెరగడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆదాయం ఏకంగా 84.37 శాతం పడిపోయి, 2,295.25 కోట్ల రూపాయలకు చేరినట్టు ఈ కంపెనీ తెలిపింది. అయితే, మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర ఆదాయం 14,688.02 కోట్ల రూపాయలకు చేరింది. చివరి త్రైమాసికంలో తగ్గుదల కనిపించినప్పటికీ, మొత్తం మీద పరిస్థితి మెరుగ్గా ఉండడంతో, బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్ 6.77 శాతం మెరుగుపడి, 545.50 రూపాయలకు చేరింది. అదే విధంగా ఎన్‌ఎస్‌ఈలో 6.99 శాతం పెరిగి, 546.50 రూపాయలుగా నమోదైంది.