బిజినెస్

భారత్‌లో ఈ ఏడాది చివరి నాటికి 10 వేల రిటైల్ స్టోర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: చైనాకు చెందిన టెక్ దిగ్గజం గ్జియోమీ మనదేశంలో సుమారు 10వేల రీటైల్ స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సంవత్సరాంతానికల్లా ఆఫ్‌లైన్‌లో 50 శాతం వాణిజ్యాన్ని భారత్ నుంచి నిర్వహించాలన్న లక్ష్యం ఉందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2014లో గ్జియోమీ ఆన్‌లైన్‌లో మాత్రం లభించే బ్రాండ్ సెల్ ఫోన్‌గా భారత్‌లో తన వాణిజ్యాన్ని ఆరంభించింది. ఈక్రమంలో వస్తున్న స్పందనను అనుసరించి తన పోటీదారు శామ్‌సంగ్‌కు దీటుగా ‘ఎమ్‌ఐ స్టుడియో’ పేరిట సరికొత్త రీటైల్ ఫార్మేట్‌తో ముందుకు వస్తోంది. ‘్భరత్‌లో మాకు 50 శాతం ఆన్‌లైన్ వాణిజ్యం వాటా ఉందని రెండేళ్ల క్రితమే మా సంస్థ గ్రహించింది. అలాంటప్పుడు రీటైల్ మార్కెట్‌ను విస్మరించడం ఎందుకని ఇలా ఆ దిశగా చర్యలు చేపట్టామని గ్జియోమీ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ మనుజైన్ విలేఖరులకు తెలిపారు. తమ కంపెనీకి ప్రస్తుతం మూడు ఫార్మేట్లలో సుమారు 6000 ఔట్‌లెట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయని, ఇందులో ఎమ్‌ఐ హోమ్స్ పేరిట 75 ఎక్స్‌పీరియన్షియల్ సోర్లు, ఎమ్‌ఐ ప్రిఫర్డ్ పార్ట్‌నర్స్ పేరిట పెద్ద పట్టణాల్లో, ఎమ్‌ఐ స్టోర్స్ పేరిట చిన్న టౌన్లలో విక్రయ శాలలు ఉన్నాయని, ఇలా నాలుగు రకాల ఆఫ్‌లైన్ విక్రయాలకు సంబంధించిన 10వేల రీటైల్ స్టోర్లను భారత్‌లో ఈ సంవత్సరాంతానికల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే 50 శాతం స్మార్ట్ ఫోన్ విక్రయాలను ఆఫ్‌లైన్ వాణిజ్య పరిధిలోకి తీసుకువస్తామని మనుజైన్ తెలిపారు. ‘ఇటీవల అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఐడీసీ విడుదల చేసిన నివేదిక మేరకు 2018 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ షిప్‌మెంట్ (ఎగుమతి) విలువలో శామ్‌సంగ్ కంటే తమ కంపెనీ 28.9 శాతం ఆధిక్యతను సాధించింద’ని ఆయన వివరించారు.