బిజినెస్

వచ్చే ఏడాదిన్నర కాలానికి ఎస్ బ్యాంకుకు ఆర్థిక ఇబ్బందులే.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఎస్ బ్యాంకు వచ్చే 12 నుంచి 18 నెలల కాలంలో లాభాల విషయంలో తీవ్ర వత్తిడిని ఎదుర్కోనుంది. నిరర్థక ఆస్తులకు ఆ బ్యాంకు ప్రాధాన్యతను ఇవ్వడమే ఇందుకు కారణమని అంతర్జాతీయ అధ్యయన సంస్థ ‘మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్’ తన నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 26న ఈప్రైవేటు బ్యాంక్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి తన నాల్గవ త్రైమాసిక గణాంకాలను విడుదల చేసింది. 2004లో ఈ బ్యాంకు ఆరంభమైన నాటినుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ఆ బ్యాంకు తొలిసారి త్రైమాసికంగా తీవ్ర ఆర్థిక నష్టాలను నమోదు చేసింది. మొత్తం సంవత్సరం పనితీరును పరిశీలిస్తే ఈ బ్యాంకు లాభాల్లోనే ఉన్నప్పటికీ నాల్గవ త్రైమాసికంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. గత మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఆస్తులపై ఆదాయాన్ని 0.5 శాతంగా ఆ బ్యాంకు చూపింది. ఐతే ఇదే సమయానికి గత ఏడాది 1.4 శాతం ఆదాయం సమకూరిం ది. మొత్తం రుణాలపై ఈ బ్యాంకుకు 8 శాతం నిరర్ధక ఆస్తు లు ఏర్పడ్డాయని, ప్రధానంగా బ్యాలెన్స్ షీట్ క్లీన్‌అప్ చేసుకోవడం ఈ బ్యాంకు లాభాలను వచ్చే 12 నుంచి 18 కాలానికి దెబ్బతీసే అవకాశాలున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. గడచిన త్రైమాసికంలో అధికంగా నిరర్థక రుణాలు (ఎన్‌పీఎల్స్) ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడిందని, సరికొత్త కార్పొరేట్ విధానం, కొత్త అధినాయకత్వం ద్వారా ఈ సమస్యను సమీప భవిష్యత్తులోనే పరిష్కరించుకునే అకాశాలున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఇలావుండగా ఎస్ బ్యాం కు త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఆ బ్యాంకు వాటాలు మంగళవారం సుమారు 30 శాతం నష్టపోయాయి. ఆరంభ దశలో బీఎస్‌ఈలో తీవ్ర వత్తిడికి గురైన ఈ వాటాలు ఒక్కొక్కటి రూ. 165.30 వంతున దిగువన ట్రేడయ్యాయి. ఆఖరుకు 29.23 శాతం నష్టాలతో వాటా విలువ రూ.168కి చేరుకుంది. గత శుక్రవారం సాయంత్రం ఈ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటికీ అప్పటికే వాణిజ్య వారం ము గిసింది. మళ్లీ సోమవారం సైతం సెలవురోజు కావడంతో ఎట్టకేలకు మంగళవారం ఈ గణాంకాలు పరిగణనలోకి వచ్చి స్టాక్ మార్కెట్లను ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ బ్యాం కు వ్యవస్థాపకుడు, దీర్ఘకాల సీఈవో రానాకపూర్‌ను ఈ ఏ డాది జనవరితో పదవీ కాలవ్యవధి ముగిసిపోగా ఆయనను కొనసాగించేందుకు రిజర్వు బ్యాంకు అంగీకరించకపోవడంతో రవ్‌నీత్ గిల్ కొత్త ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ బ్యాంకు వచ్చే మూడేళ్లలో రుణాల కేటాయింపును ఏటా 20 నుంచి 25 శాతం వరకు తగ్గించుకునే అవకాశాలున్నాయని మూడీస్ నివేదిక అంచనా వేసింది.