బిజినెస్

ఒడిదుడుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 30: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా అనుచిత రుణ పంపిణీల ద్వారా తీవ్ర ఆర్థిక నష్టాలకు గురైన ప్రైవేటు రంగంలోని ఎస్ బ్యాంకు ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గత మార్చితో ముగిసిన త్రైమాసికానికి ఎస్ బ్యాంకు రూ. 1,506.64 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. కాగా బీఎస్‌ఈలో సెనె్సక్స్ 35.78 పాయింట్లు కోల్పోయి 0.09 శాతం నష్టంతో 39,031.55 వద్ద దిగువన స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 6.50 పాయింట్లు కోల్పోయి 0.06 శాతం నష్టంతో 11,748.15 వద్ద దిగువన స్థిరపడింది. కాగా త్రైమాసికంగా తొలిసారి నష్టాలపాలైన ఎస్ బ్యాంకు వాటాలు 30 శాతం పతనమయ్యాయి. అలాగే సెనె్సక్స్ ప్యాక్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరోమోటోకార్ప్, మహీంద్రా సైతం దాదాపు 5.21 శాతం నష్టపోయాయి. బ్యాంకింగ్, వాహన రంగాల వాటాలు ప్రధానంగా నష్టాలను కూడగట్టుకున్నాయి. ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం తీవ్రంగా వాటాల విక్రయ వత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇందులో అధికంగా నష్టపోయిన కంపెనీల్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనా న్స్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ దాదాపు 6 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. ఇక ఆసియన్ మార్కెట్ల విషయానికి వస్తే మంగళవారం అధిక దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలనే చవిచూశాయి. చైనా తయారీ రంగం ఎదుర్కొన్న నష్టాలు ఆసియన్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. ఈ క్రమంలో మదుపర్లు ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేశారు. అమెరికాకు చెందిన సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ బుధవారం తన విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో మదుపర్లు ఆ విషయంపై దృష్టిని కేంద్రీకరించారు.