బిజినెస్

వాహనదారులపై బీమా భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: వాహనదారులపై బీమా భారం మరింత పెరగనుంది. కార్లు, బైక్‌లు తదితర వాహనాల బీమా ప్రీమియంలు వచ్చే నెల 1 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి మరి. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచి వాహన బీమా ప్రీమియంలను పెంచాలని బీమారంగ రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ నిర్ణయించడంతో ఏప్రిల్ 1 నుంచి మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలకు రెక్కలు రానున్నాయి. చిన్న కార్లకు (1000 సిసి సామర్థ్యం వరకు) థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం 39.9 శాతం మేర పెరుగుతోంది. ప్రస్తుతం 1,468 రూపాయలుగా ఉన్న ప్రీమియం.. ఏప్రిల్ 1 నుంచి 2,055 రూపాయలకు చేరుతోంది. అలాగే మధ్య శ్రేణి కార్ల (1,000-1,500 సిసి సామర్థ్యం వరకు) ప్రీమియం కూడా దాదాపు 40 శాతం వరకు పెరుగుతోంది. ఇక 1,500 సిసి సామర్థ్యానికి ఎగువన ఉన్న పెద్ద కార్లు, ఎస్‌యువిల బీమా ప్రీమియం 25 శాతం పెరుగుతోంది. ఇప్పుడు 4,931 రూపాయలుగా ఉన్న వీటి ప్రీమియం చార్జీ.. ఏప్రిల్ 1 నుంచి 6,164 రూపాయలకు చేరుతోంది. ‘ద్రవ్యోల్బణం సూచీ విలువ (సిఐఐ) గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం 5.57 శాతం పెరిగింది. 2014-15లో 1024గా ఉన్న సిఐఐ.. 2015-16లో 1,081కి చేరింది. కాబట్టి వాహన బీమా ప్రీమియంలను పెంచాల్సి వస్తోంది.’ అని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) తెలిపింది. పెరిగిన ప్రీమియం చార్జీలు ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా, బైకులు, స్కూటర్ల వంటి ద్విచక్ర వాహనాల బీమా ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. కొత్త ప్రీమియం ధర ప్రకారం 75 సిసి సామర్థ్యం కలిగిన టూవీలర్ల బీమా ప్రీమియం 519 నుంచి 569 రూపాయలకు చేరుతోంది. 75-150 సిసి టూవీలర్ల ప్రీమియం 15 శాతం పెరిగి 619 రూపాయలకు చేరితే, 150-350 సిసి టూవీలర్లది 25 శాతం పెరుగుతోంది. ఇకపోతే త్రీవీలర్లకు కూడా కనీస థర్డ్ పార్టీ ప్రీమియం పెరుగుతోంది. అలాగే ఆరుగురు ప్యాసింజర్ల సామర్థ్యం కలిగిన ఈ రిక్షాల కనీస థర్డ్ పార్టీ ప్రీమియంను 1,125 రూపాయలుగా నిర్ణయించింది ఐఆర్‌డిఎఐ. స్థూలంగా చూస్తే పబ్లిక్ క్యారియర్ల బీమా ప్రీమియం 15-30 శాతం పెరుగుతోంది. అయితే 12 టన్నుల వరకు సామర్థ్యం కలిగిన గూడ్స్ రవాణా వాహనాలకు మాత్రం బీమా ప్రీమియంలో ఎలాంటి మార్పులూ లేవు. వాహనాలకు మోటార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి అన్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ మార్పులను ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు గమనించి తదనుగుణంగా నడుచుకోవాలని ఐఆర్‌డిఎఐ సూచించింది.
వెనక్కి తీసుకోవాలి: ఎఐఎమ్‌టిసి
థర్డ్ పార్టీ ప్రీమియం పెంపును వెనక్కి తీసుకోవాలని ఐఆర్‌డిఎఐను ట్రక్కుల సంఘం ఎఐఎమ్‌టిసి డిమాండ్ చేసింది. ఇలాంటి ఓ నిర్ణయం తీసుకునే ముందు ట్రాన్స్‌పోర్టర్లను సంప్రదిస్తామన్న ఐఆర్‌డిఎఐ.. ఇప్పుడు ఆ హామీని ఉల్లంఘించిందని ఓ ప్రకటనలో మండిపడింది. ఈ చర్య బీమా సంస్థల ప్రయోజనాలను ఉద్దేశించి చేసినదేనని ఆరోపించింది.