బిజినెస్

స్టాక్ మార్కెట్లకు భారీ కుదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: అమెరికా-చైనా వాణిజ్య చర్చలు విఫలమవుతాయన్న వార్తలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ప్రధానంగా బీఎస్‌ఈలో సెనె్సక్స్ సోమవారం 362.92 పాయింట్లు కోల్పోయింది. అంతర్జాతీయంగా వాటాల అమ్మకాల వత్తిడి నెలకొంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ సైతం 114 పాయింట్లు నష్టపోయి 11,600 పాయింట్ల దిగువకు చేరింది. అంతర్జాతీయంగా రెండు ప్రధాన ఆర్థిక శక్తులైన అమెరికా-చైనా మధ్య సాగుతున్న చర్చలు విఫలమవుతాయని వాణిజ్య నిపుణులు అంచనా వేశారు. ఇందుకు కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం చేసిన ప్రకటనే. అమెరికాకు దిగుమతి అవుతున్న చైనాకు చెందిన 200 బిలియన్ల విలువైన ఉత్పత్తులపై సుంకాలను పెంచుతామని ట్రంప్ హెచ్చరించడంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల మార్కెట్లపై ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా చైనాకు చెందిన షాంఘయ్ కాంపోజిట్ సూచీ సుమారు 5.58 శాతం పతనమైంది. అలాగే ఐరోపా దేశాల ఈక్విటీలు సైతం తొలి సెషన్‌లో నష్టాలతోనే ట్రేడయ్యాయి. కాగా మనదేశ స్టాక్ మార్కెట్లో బీఎస్‌ఈలో సెనె్సక్స్ రోజంతా తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. తొలుత 453 పాయింట్లు నష్టపోయిన ఈ సూచీ తర్వాత స్వల్పంగా కోలుకుని చివరికి 362.92 పాయింట్లు కోల్పోయి 0.93 శాతం నష్టాలతో 38,600.34 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి 0.97 శాతం నష్టాలతో 11,598.25 వద్ద స్థిరపడింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, టాటాస్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఆసియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంకు, ఎమ్ అండ్ ఎమ్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ దాదాపు 5.30 శాతం మేర నష్టపోయాయి. కాగా ఇంతటి వ్యతిరేక పరిస్థితులను సైతం అధిగమించి ఐటీసీ, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ లాభాలను సంతరించుకోవడం గమనార్హం. కాగా చైనాకు చెందిన 200 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పతుల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతామని ట్విట్టర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో స్పందించిన చైనా వాణిజ్య విభాగం అధికారులు బుధవారం అమెరికాకు వెళ్లి చర్చలు జరిపేందుకు సమాయత్తమయ్యారు. ఈక్రమంలోనే విదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు సుమారు రూ. 400.68 కోట్ల విలువైన వాటాలను గత శుక్రవారం విక్రయాలు జరిపారు. అలాగే దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు రూ. 57.07 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ ఇంట్రాడేలో 19 పైసలు తగ్గి 69.41 రూపాయలకు దిగువకు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 0.92 శాతం తగ్గి బ్యారెల్ 70.20 పలికింది.