బిజినెస్

4 రెట్లు పెరిగిన ‘బీ టు బీ’ అంకుర సంస్థల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 7: మనదేశంలో గడచిన 2018లో ‘బిజినెస్ టు బిజినెస్’ అంకుర సంస్థల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. 2014లో 800గా ఉన్న ఈ సంఖ్య గత ఏడాది 3,200కు చేరుకుంది. పర్యావరణ స్థితిగతుల ఆధారంగా గణనీయ ప్రగతిని సాధిస్తూ 3.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ అంకుర సంస్థలు ఆకర్షించాయి. 2014లో ఈ సంస్థలు పెట్టుబడులు 797 మిలియన్ డాలర్లుగా ఉండేవి. బెంగళూరు, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ‘బిజినెస్ టు బిజినెస్’ అంకుర సంస్థలు విస్తరిస్తున్నాయని ప్రముఖ డేటా మేనేజ్‌మెంట్, హైబ్రిడ్ క్లౌడ్ సంస్థ ‘నెటాప్’, అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ సంయుక్త అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ మూడు ప్ర ముఖ నగరాల్లో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజిటలైజేషన్‌ను పారిశ్రమ లు, ఆర్థిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ సంస్థలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో భారీ ఎత్తున అమ లు చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. స్టార్టప్ ఎకోసిస్టంలో బి అండ్ బి స్టార్టప్‌లు సంఖ్యాపరంగా 2014లో 26 నుంచి 2018లో 43కు చేరింది. చిన్నచిన్న పట్టణాలను సైతం పరిశోధనలకు నిలయంగా మార్చేలా దేశీయ అంకుర సంస్థలు విస్తరిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది.