బిజినెస్

11 ఆర్‌సీఈపీ సభ్యదేశాలతో వెనుకబడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌ఈసీపీ)లో సభ్యత్వం కలిగిన 11 దేశాలతో వాణిజ్యం విషయంలో భారత్ వెనుకబడిపోతోంది. 2018- 19 ఆర్థిక సంవత్సర గణాంకాలు ఈవిషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2012 నవంబర్ నుంచి చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలతో కలుపుకుని మొత్తం 16 దేశాలు గ్రూపుగా ఏర్పడి మెగా వాణిజ్య ఒప్పందాలపై ఆర్‌సీఈపీ వేదికగా సంప్రదింపులు సాగిస్తున్నాయి. ఇందులో 10 ఆసియన్ దేశాలైన బ్రునెయ్, కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్, సింగపూర్, థాయ్‌ల్యాండ్, ఫివిప్పీన్స్, లావోస్, వియత్నాంలతోబాటు మరో ఆరు ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) కలిగిన దేశాలైన భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్‌కూ ఆర్‌ఈసీపీలో భాగస్వామ్యం ఉంది. కాగా బ్రునెయ్, జపాన్, మలేసియా దేశాల ఎగుమతులు, దిగుమతులతో పోలిస్తే భారత్ వాణిజ్యంలో గత ఆర్థిక సంవత్సరం కంటే 2018-19 సంవత్సరానికి గణనీయంగా వృద్ధిని నమోదు చేసింది. ఐతే ఈ మూడు దేశాలతో వాణిజ్య దూరం మాత్రం 0.5 బిలియన్లు, 7.1 బిలియన్, 3.8 బిలియన్ల డాలర్లుగా ఉంది, 2017-18లో ఈ గ్యాప్ 0.4 బిలియన్లు, 6.2 బిలియన్, 3.3 బిలియన్ డాలరుగా ఉండేది. అంతేకాక ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, కొరియా, న్యూజీల్యాండ్ , థాయ్‌ల్యాండ్ దేశాలతో భారత్‌కు గతంలో ఉన్న వాణిజ్య లోటు గడచిన ఆర్థిక సంవత్సరంలో సమమైంది. ఐతే సింగపూర్‌తో మాత్రం వాణిజ్యం 2017-18లో ఉన్న 2.7 బిలియన్ డాలర్ల లోటు నుంచి గడచిన ఆర్థిక సంవత్సరంలో 5.3 బిలియన్ డాలర్ల మిగులుకు చేరింది. అలాగే కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్‌తో కూడా నిర్దేశిత లక్ష్యాలకన్నా అదనంగా వాణిజ్యం జరిగింది. కాగా లావోస్‌తో గడచిన ఏడాది భారత్ ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలూ సాగించలేదు. ఈక్రమంలో వాణిజ్య సంబంధాల్లో దూరం ఏర్పడిన దేశాలతో మెగా వాణిజ్య ఒప్పందాలను ఏర్పాటు చేసుకునే దిశగా భారత్ సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఈ సంప్రదింపులు చాలా విలువైనవని ఇవి ఫలవంతమైతే భారత్‌కు చెందిన వస్తువులు, సేవలు ఇతర దేశాల మార్కెట్లలో స్థానం దక్కించుకుంటాయని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఐతే భారత్‌కు ఆర్‌సీఈపీ సభ్య దేశాల్లో పలు దేశాలతో వాణిజ్య లోటు ఏర్పడిన క్రమంలో ఈ ఒప్పందాల విషయంలో భారత్ చాలా జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుందని మరికొంతమంది మార్కెట్ విశే్లకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో దేశీయ తయారీ రంగానికి నష్టం కలుగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ‘ఉచిత వాణిజ్య ఒప్పందాలు మనదేశంలోకి ఇతర దేశాలకు వాణిజ్య వెసులుబాటు కల్పించడమే కాదు. ఇతర దేశాల మార్కెట్లలోకి మనమూ ప్రవేశించేందుకు వీలు కల్పిస్తాయని, సాధారణంగా సింగపూర్ వంటి దేశాలకు మన ఎగుమతులు ప్రతిఏటా లక్ష్యాన్ని మంచి ఉంటుంటాయి. ఐతే గడచిన 2018-19లో ఈ ఎగుమతులు పెరగలేదని, పైగా లోటు ఏర్పడింద’ని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర అచార్యుడు బిశ్వజిత్‌దార్ తెలిపారు. మరోవైపు చైనా, అమెరికాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలేవీ భారత్‌కు లేవని, ఐనప్పటికీ అమెరికాతో మనదేశం అత్యధిక సానుకూల వాణిజ్య సమతుల్యాన్ని కొనసాగిస్తోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అదేక్రమంలో చైనాతో మాత్రం అధిక వాణిజ్యలోటు ఉందని తెలిపారు. వస్తువులు, సేవలు, పెట్టుబడులు, ఆర్థిక, సాంకేతిక సహకారం, పోటీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కు లు వంటి వాటిపై సత్వరమే ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాలను సత్వరమే పూర్తి చేసుకోవాల్సిన అవసరం భారత్‌కు ఉందని అంటున్నారు. సుంకాలను కొన్ని ఉత్పత్తులపై మినహాయించాలన్న ప్రతిపాదన అమలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
మరోవైపు దేశీయ ఉక్కు, లోహ పరిశ్రమలు ఈ వాణిజ్య ఒప్పందం పరిధిలో ఉండటానికి ఇష్టపడడం లేదు.