బిజినెస్

సోలార్ పీవీతో రూ. 50వేలు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: టాటా పవర్ సోలార్‌ను రెసిడెన్సియల్ రూఫ్‌టాప్ ద్వారా సంవత్సరానికి 5 కిలోవాట్లకు రూ. 50వేల వరకు ఆదా చేయవచ్చని టాటా పవర్ ఎండీ, సీఈఓ ప్రవీర్ సిన్హా అన్నారు. మంగళవారం తిరుపతి-రేణిగుంట రోడ్డులోని ఐఐటీ వద్ద రూఫ్‌టాప్ ప్రచారం ప్లెడ్జ్ఫ్‌ర్ సోలార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సౌరశక్తి స్వీకరణ ప్రయోజనాలను వివరిస్తూ తిరుపతిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ ప్రవీర్ సిన్హా మాట్లాడుతూ ప్లెడ్జ్ ఫర్ సోలార్ వినియోగదారులను స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన పరిష్కారాల వైపు మళ్లేందుకు దోహదపడుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా తమ వినియోగదారులకు అతి సులభమైన, అతి తక్కువ ఖర్చు కలిగిన విద్యుత్ పరిష్కారాలను అందించేందుకు తాము సోలార్ రూఫ్‌టాప్‌ను అందిస్తున్నామన్నారు. ఈ సేవల ప్రయోజనాలను తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలోని 100 నగరాల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈరంగంలో 29 సంవత్సరాల అనుభవంతో టాటా పవర్ సోలార్ ఇప్పటి వరకు 280 మెగావాట్ల ఇన్‌స్టాలేషన్స్‌ను చేసి, 10వేలకు పైగా గృహాలకు విద్యుత్‌ను అందించినట్లు ఆయన ప్రకటించారు. టాటా పవర్ రెన్యువబల్స్ ప్రెసిడెంట్ అశీష్ ఖన్నా మాట్లాడుతూ ప్లెడ్జ్ఫ్‌ర్ సోలార్ నూతన ప్రచారం ద్వారా వాణిజ్యప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడంతోపాటుగా గృహ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్ నాణ్యత అంశాలను గురించి తెలియజేస్తామన్నారు. అతి తక్కువ ఖర్చు కలిగిన రూఫ్ టాప్ పరిష్కారాలతో వినియోగదారులు ఇంధనాన్ని పొదుపు చేయడమే కాకుండా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని అన్నారు.