బిజినెస్

14 నెలల్లో రూ.5,800 కోట్ల ఎన్నికల బాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, జూన్ 16: రాజకీయ పార్టీలకు విరాళాల్లో భాగం గా రుణదాతలు దాదాపు రూ.5,800 కోట్లకు పైగా ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2018 మార్చి 1 నుంచి ఈ ఏడాది మే 10 తేదీ మధ్య ఇంత విలువైన ఎన్నికల బాండ్లు అమ్మినట్లుగా సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటీషన్‌కు జవాబుగా ఎస్‌బీఐ వివరించింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఎన్నికల బాండ్ల పథకంలో భాగంగా కేవలం తమ 29 బ్రాంచీల్లోనే బాండ్లను దశల వారీగా విడుదల చేసుకోవచ్చని తెలిపింది. ప్రజలు ఎన్నికల బాండ్లను రూ.5851.41 కోట్ల మేర తీసుకున్నట్లు వివరించింది. ఈ వివరాలను తెలియజేయాల్సిందిగా నీర్‌ముచ్‌కు చెందిన క్రియాశీల కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ అడిగారు.