బిజినెస్

ఈ-నామ్ ద్వారానే మార్కెట్ యార్డు లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 20: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో లావాదేవీలన్నీ ఈ-నామ్ విధానం ద్వారానే జరగాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ఆదేశించారు. ప్రస్తుతం 22 మార్కెట్ యార్డుల్లో ఈ-నామ్ అమలులో ఉందని, రానున్న కాలంలో అన్ని మార్కెట్ యార్డుల్లోనూ ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. గురువారం గుంటూరులోని మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయంలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న వివిధ మార్కెట్ యార్డుల సంయుక్త, ఉప, సహాయ సంచాలకులు, ఇంజనీర్లు, ఉన్నత శ్రేణి కార్యదర్శులతో కమిషనర్ ప్రద్యుమ్న వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ-నామ్ అమలులో ఉన్న మార్కెట్ యార్డుల్లో మార్కెట్ ఫీజు ఆన్‌లైన్ ద్వారానే మార్కెట్ కమిటీలకు చెల్లింపులు జరగాలని సూచించారు. మార్కెట్ యార్డుల్లో నూరు శాతం లావాదేవీలు ఈ-నామ్ ప్లాట్‌ఫారం ద్వారా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో జరగుతున్న వివిధ అభివృద్ధి పనులను, రైతుబజారు అభివృద్ధి, నిర్వహణ అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. మార్కెట్ కమిటీల్లో పెండింగ్‌లో ఉన్న వ్యాపారుల అసెస్‌మెంట్‌లు త్వరితగతిన పూర్తి చేసి ఆడిట్ అధికారుల అభ్యంతరాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కోరారు. మార్కెట్ యార్డులకు సరుకు తీసుకువచ్చే రైతులకు అన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలని, గిట్టుబాటు ధరకు విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు.