బిజినెస్

మద్యం పాలసీ కోసం ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 24: కొత్త ప్రభుత్వంలో నూతన మద్యం పాలసీ ఏ విధంగా ఉంటుందోనని మద్యం వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు కానున్నాయి. ఇదే సందర్భంలో రాష్టవ్య్రాప్తంగా బార్ల లైసెన్సులకు మరో రెండేళ్ల గడువు ఉంది. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల్లో 4,401 మద్యం దుకాణాలు, 834 బార్లు ఉన్నాయి. మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి నెలాఖరుతో ముగియనుండటంతో ప్రభుత్వం అమలు చేయబోయే నూతన విధానంపై మద్యం వ్యాపారుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం రెండేళ్ల కాల పరిమితికి లైసెన్సులు జారీ చేసింది. వీటి కాలపరిమితి జూన్ 30వతేదీతో ముగుస్తుంది. దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో మార్పులకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను క్రమంగా తగ్గించడంతోపాటు చివరకు మద్యం దుకాణాలను మూసివేసి, కేవలం స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్తగా జూలై నుంచి ప్రారంభం కావాల్సిన మద్యం పాలసీ విషయంలో వ్యాపారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 543 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయగా, 206 మద్యం దుకాణాలతో కర్నూలు చివరి స్థానంలో ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 474, చిత్తూరులో 434, విశాఖ జిల్లాలో 402, గుంటూరు 359, కృష్ణా 349, నెల్లూరు 347, ప్రకాశం 333, కడప 264, అనంతపురం 247, శ్రీకాకుళం 241, విజయనగరం 210 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక బార్ల విషయానికొస్తే గుంటూరు జిల్లాలో అత్యధికం 185 ఉండగా, కృష్ణా జిల్లాలో 167, విశాఖ జిల్లాలో 131 ఉన్నాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో కేవలం 17 మాత్రమే బార్లకు లైసెన్సులు జారీ చేశారు. బార్ల లైసెన్సులకు మరో ఏడాది గడువు ఉండటంతో ప్రస్తుతానికి పాలసీపై ఎటువంటి సందిగ్ధత లేదు.
మరో అయిదు రోజుల్లో మద్యం దుకాణాల లైసెన్సులకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త పాలసీ వచ్చేవరకూ పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకం. ప్రస్తుతం కలెక్టర్ల సదస్సు జరుగుతుండగా, 25 తరవాతే మద్యం పాలసీపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే మిగిలిన మూడు, నాలుగు రోజుల్లో కొత్త పాలసీ రూపకల్పన, అమలుకు సమయం చాలదు. దీంతో పాత విధానానే్న మరో నెలరోజులు పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త పాలసీని ప్రకటించి, దుకాణాలకు లైసెన్సులు జారీ చేసే వరకూ పాత దుకాణాలు కొనసాగించే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదిలా ఉండగా గత ఏడాదితో పోలిస్తే ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఏడాది ఐఎంఎల్ విక్రయాలు 70.02 లక్షల కేసులు కాగా, గతేడాది కంటే 8.65 శాతం తక్కువ. ఇదే సందర్భంలో బీర్ విక్రయాలు 22.43 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుత జూన్ వరకూ 84.24 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. మొత్తంగా చూస్తే 10 శాతం మేర ఎక్సైజ్ ఆదాయం పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.