బిజినెస్

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సోమవారం అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మూడేళ్ల పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఆరు నెలల వ్యవధి ఉన్నప్పటికీ ఆయన వైదొలగడం చర్చనీయాంశమైంది. అయితే కేవలం వ్యక్తిగత కారణాల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా ఆర్బీఐ నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తులు వైదొలగడం గత ఏడు నెలల కాలంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. 2018 డిసెంబర్‌లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సైతం పదవీ కాలం ఇంకా తొమ్మిది నెలలు మిగిలివుండగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా కొన్ని వారాల క్రితం ఉర్జిత్ పటేల్ ఆర్బీఐకి లేఖ రాస్తూ కొన్ని అనివార్య వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను తన పదవిలో కొనసాగలేకపోతున్నానని తెలియజేశారని సోమవారం నాడిక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆర్బీఐ పేర్కొంది. గతంలో ఆయన నియామకానికి ఆమోదం తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తాజాగా ఆచార్య రాజీనామాకు సైతం ఆమోదం తెలపాల్సి ఉందని ఆర్బీఐ తెలిపింది. కాగా విరాల్ ఆచార్య వైదొలగడంతో ఆర్బీఐకి ఇక ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు ఎన్‌ఎస్ విశ్వనాథన్, బీపీ కానుంగో, ఎంకే జైన్ ఉంటారు. న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టెమ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విరాల్ ఆచార్య 2016 డిసెంబర్‌లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2017 జనవరిలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో డీ మానిటరైజేషన్ అనంతరం నెలకొన్న పరిణామాలతో డిపాజిట్లు, సొమ్ము విత్‌డ్రాయల్స్ విషయంలో పదేపదే విధాన నిర్ణయాలను మార్చుతూ ఆర్బీఐ విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా ఆర్బీఐలోని ద్రవ్య వినిమయ, పరిశోధనా క్లస్టర్ నిర్వహణ చేపట్టారు. ఈక్రమంలో సెంట్రల్ బ్యాంకు స్వతంత్ర ప్రతిపత్తిని ఎత్తిచూపుతూ ఆచార్య కేంద్ర ప్రభుత్వంపై, ఆర్థిక మంత్రిత్వ శాఖపై పలు విమర్శలు చేసి వార్తల్లోకి ఎక్కారు. దీంతో ఉర్జిత్ పటేల్ గవర్నర్‌గా వైదొలిగినప్పటి నుంచే ఆచార్య సైతం వెళ్లిపోతారన్న ఊహాగానాలు వెలువడ్డాయి.

చిత్రం... విరాల్ ఆచార్య