బిజినెస్

ఆల్‌టైం రికార్డు స్థాయికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 28: మనదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరాయి. ఈ మొత్తం 4,215 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం ఈనెల 21 నుంచి వారం వ్యవధిలోనే 426.42 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరిందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. 2018 ఏప్రిల్ 13 నుంచి వారం రోజుల వ్యవధిలో 426.028 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి విదేశీ మారక ద్రవ్యం సమకూరిందని ఫారెక్స్ రిజర్వ్సు అంచనా వేసింది. ఈ వారం పెరిగిన విదేశీ కరెన్సీ నిల్వలే ప్రధానంగా విదేశీ మారక ద్రవ్య పెరుగుదలకు దోహదం చేశాయని ఆ అంచనాలు తెలిపాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు కొత్తగా ఈ వారం 398,649 బిలియన్ డాలర్ల నుంచి 4,202 బిలియన్ డాలర్లకు పెరిగాయి. సాధారణంగా విదేశీ మారక ద్రవ్యం హెచ్చు తగ్గులు నాన్ అమెరికన్ కరెన్సీలు అంటే యూరోలు, పౌండ్లు, యెన్‌లు వంటి వాటి విలువను అనుసరించి జరుగుతుంటాయి. కాగా ఆర్బీఐ గణాంకాల మేరకు బంగారు నిల్వల్లో ఎలాంటి పెరుగుదల లేదు. ఈ మొత్తం 22,958 బిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద ప్రత్యేక ఉపసంహరణ హక్కులు కూడా 4.2 మిలియన్ డాలర్లు పెరిగి ఈ మొత్తం 1,453 బిలియన్ డాలర్లకు చేరింది. మనదేశ నిధుల నిల్వ కూడా 9.6 మిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 3,354 బిలియన్ డాలర్లకు చేరింది.