బిజినెస్

అంతర్జాతీయ ప్రతికూలతలతో.. నష్టాల్లో సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 28: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూలతలతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా హెవీ వెయిట్స్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్‌లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ సూచీ సెనె్సక్స్ 191.77 పాయింట్లు కోల్పోయి 0.48 శాతం నష్టాలతో 39,394.64 పాయింట్ల దిగువన స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 52.70 పాయింట్లు కోల్పోయి 0.45 శాతం నష్టాలతో 11,788.85 పాయింట్ల దిగువన స్థిరపడింది. ఇంట్రాడేలో సెనె్సక్స్ ఒక దశలో 39,361.92 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 39,675.25 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే నిఫ్టీ కూడా 11,775.50 కనిష్టాన్ని, 11,871.70 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. సెనె్సక్స్ ప్యాక్‌లో ఎస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్. టాటా మోటార్స్, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, వేదాంత, టాటా స్టీల్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐసీ బ్యాంక్ అత్యధికంగా 3.29 శాతం నష్టపోయాయి. మరోవైపు బజాజ్ ఫైనాన్స్, ఆక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, మారుతీ, హెచ్‌యూఎల్, టెక్ మహేంద్రా సుమా రు 1.05 శాతం లాభాలను సంతరించుకున్నాయి. కాగా ఆసియా దేశాల్లో నెలకొన్న ప్రతికూల ప్రభా వం దేశీయ స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేసిందని వ్యాపారులు చెబుతున్నారు. జపాన్‌లోని ఒసాకోలో జీ-20 శిఖరాగ్ర సదస్సులో నెలకొన్న వాణిజ్య పరమైన పరిస్థితులను నిశితంగా పరిశీలించిన మదుపర్లు ఆచితూచి వ్యవహరించడంతో ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతోనే ముగిశాయని నిపుణులు విశే్లషిస్తున్నారు. అలాగే ఆ సదస్సులో భారత్- అమెరికా చర్చల స్థితిగతులపై సైతం మదుపర్లు దృష్టిపెట్టారంటున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను సెబీ కఠినతరం చేయడం కూడా స్టాక్‌మార్కెట్‌ను ప్రభావితం చేసిందని అంటున్నారు. మ్యూచువల్ ఫండ్ విక్రయాలకు సంబంధించిన ద్రవ్య పథకాలకు కనీసం 20 శాతం ద్రవ్య ఆస్తులు అంటే డబ్బు, బంగారం ఉండాలన్న నిబంధనను సెబీ విధించింది.
స్వల్పంగా బలపడిన రూపాయి
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం 4 పైసలు పెరిగి 69.03 రూపాయలుగా ట్రేడైంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. బ్యారెల్ ధర 65,64 డాలర్లు పలికింది.