బిజినెస్

సమష్టి కృషితోనే సింగరేణి అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: సమష్టి కృషితోనే సింగరేణి బొగ్గు గనులను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ కోరారు. ఆయన కార్మిక యూనియన్ నేతలతో పాటు ఉద్యోగులతో బుధవారం జరిపిన చర్చల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సింగరేణికి వస్తున్న లాభాలను పరిశీలిస్తే కార్మికులు, ఉద్యోగులు సంయుక్తంగా చేస్తున్న కృషి అంటూ ఆయన కొనియాడారు. సింగరేణి అభివృద్ధికి గుర్తింపు యూనియన్ నేతలు, ఉద్యోగులు చేసిన పలు సూచనలపై సీఎండీ స్పందించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జాప్యం లేకుండా వారికి చెందాల్సిన బెనిఫిట్స్‌ను అందజేస్తామన్నారు. ఈ ఏడాది లాభాల బోనస్ చెల్లింపులపై కార్మిక యూనియన్‌లు ప్రస్తావించగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎండీ స్పష్టం చేశారు. త్వరలో గతం కంటే ఎక్కువగా బోనస్ చెల్లించే విషయాలను పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉద్యోగుల పని గంటలు పెరగాలని ఆయన సూచించారు. రాబోవు రోజుల్లో 100 మిలియన్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి థర్మల్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచాలన్నారు. దీంతో 50 వేల కోట్ల టర్నోవర్, 5వేల కోట్ల లాభాలను ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన కార్మిక యూనియన్, ఉద్యోగులకు సూచించారు. సమావేశంలో గుర్తింపు కార్మిక యూనియన్ నుంచి వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి పాల్గొనగా, ప్రాతినిధ్య సంఘం నుంచి అధ్యక్షుడు గట్టయ్య, కార్యదర్శి మిరియాల రంగయ్య, అధికారుల సంఘం నుంచి జక్కం రమేష్, కార్యదర్శి ఎన్‌వీ రాజశేఖర్ పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం నుంచి డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, భాస్కర్‌రావు, బలరాం, మహేష్ పాల్గొన్నారు.