బిజినెస్

అధిక వృద్ధికి రోడ్‌మ్యాప్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: భారత్ తిరిగి అధిక వృద్ధి రేటు పథంలోకి ప్రవేశించడానికి 2019-20 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రోడ్‌మ్యాప్ వేసిందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మరుసటి రోజు జైట్లీ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన స్పందనలో ఈ విషయం పేర్కొన్నారు. మంచి ఆర్థికశాస్త్రం, తెలివయిన రాజకీయాలలో ఎవరయినా దేనిని ఎంచుకుంటారనే ప్రాథమిక ప్రశ్న ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని ఆయన తెలిపారు. ‘ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలనేది సముచితం కాదు. ఏ ప్రభుత్వానికయినా తట్టుకొని నిలబడటం, మంచి పనితీరును కనబరచడం అనే రెండూ అవసరమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి అయిదేళ్ల కాలంలో మంచి ఆర్థికశాస్త్రం, మంచి రాజకీయాలు అనే రెండూ కలిసి ఉన్నాయి’ అని జైట్లీ ‘ద బడ్జెట్ 2019-20’ అనే శీర్షికతో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. మధ్య తరగతి, నవీన మధ్య తరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక రంగాలకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అఫర్డేబుల్ హౌసింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వంటి వాటిని ఆయన ఉదహరించారు. వౌలిక సదుపాయాలు, నిర్మాణ, స్థిరాస్తి రంగాలకు ఊతమిస్తూనే, ఉద్యోగాల కల్పనను, పెట్టుబడుల ఆకర్షణను కూడా బడ్జెట్ ప్రోత్సహించిందని ఆయన పేర్కొన్నారు. ‘్భరత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. గత రెండు నుంచి మూడు త్రైమాసికాలలో ఆర్థిక వృద్ధి కొంత మితముగా కనిపిస్తోంది. అయితే, బడ్జెట్ ఒక విధానపత్రంగా భారత్ మళ్లీ వృద్ధి పథంలోకి ప్రవేశించడానికి రోడ్‌మ్యాప్‌ను వేసింది’ అని జైట్లీ పేర్కొన్నారు.

చిత్రం... మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ