బిజినెస్

రండి.. పెట్టుబడులు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 29: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా మదుపరులను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆహ్వానించారు. ప్రస్తుతం నాలుగు రోజుల ఆసీస్ పర్యటనలో ఉన్న జైట్లీ.. మంగళవారం ఇక్కడ సిడ్నీ క్యాంపస్ ఆఫ్ ఎస్‌పి జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తున్నామని, దానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తామని హామీనిచ్చారు. అలాగే పన్నులు తదితర అంశాలను సుహృద్భావ ధోరణిలో పరిష్కరిస్తున్నామని కూడా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న మందగమన పరిస్థితుల మధ్య విదేశీ వాణిజ్యం ప్రతికూలంగా మారిందని, అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు సంబంధించి తీసుకుంటున్న ఆర్థిక సంస్కరణలు భారత జిడిపి వృద్ధిరేటును 7.5 శాతానిపైగా తీసుకెళ్తున్నాయన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 25న ప్రారంభమయ్యే రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు అంశం చర్చకు వచ్చే వీలుంది.
అందరూ కోరేదే కోరుతున్నా..
న్యూఢిల్లీ: వచ్చే నెల 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యసమీక్ష నిర్వహిస్తున్న క్రమంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అందరూ కోరుకునేదే తానూ కోరుకుంటున్నానని అన్నారు. మంగళవారం ఉదయం ఆస్ట్రేలియాకు చేరిన జైట్లీ అంతకుముందు ఇక్కడ పిటిఐతో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్లను ప్రభుత్వం తగ్గించిందని, కాబట్టి దీనికి అనుగుణంగా రుణాలపై వడ్డీరేట్లు కూడా తగ్గాల్సిన ఉందన్నారు. అలా జరగాలంటే రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు దిగిరావాల్సి ఉందన్నారు. కాబట్టి రాబోయే ద్రవ్యసమీక్షలో ఈ దిశగా ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాబోయే ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష నూతన ఆర్థిక సంవత్సరం (2016-17)లో జరిగే తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్ష కానుంది.
జిఎస్‌టి బిల్లుకు ఆమోదం లభిస్తుంది
వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని జైట్లీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో నిలిచిపోయింది. లోక్‌సభలో ప్రభుత్వానికి తగినంత మెజారిటీ ఉండగా, రాజ్యసభలో కాంగ్రెస్‌కు మెజారిటీ ఉండటమే దీనికి కారణం. నిజానికి ఈ ఏప్రిల్ 1 నుంచే జిఎస్‌టిని అమల్లోకి తేవాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే జిఎస్‌టి బిల్లులో కాంగ్రెస్ కొన్ని సవరణలకు పట్టుబడుతుండగా, అందులో కొన్నింటికి ప్రభుత్వం ఆమోదించింది. అయినప్పటికీ ప్రతిష్ఠంభన కొనసాగుతుండగా, కాంగ్రెస్ తీరును సర్కారు తప్పుబడుతోంది. జిఎస్‌టి అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పురోగమిస్తుందని కేంద్రం చెబుతోంది.