బిజినెస్

10.8 శాతం పెరిగిన టీసీఎస్ త్రైమాసిక లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 9: దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మంగళవారం తన త్రైమాసిక ఫలితాల నివేదికను విడుదల చేసింది. గత జూన్‌తో ముగిసిన ఈ కాలంలో ఈ సంస్థ 10.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ. 8.131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 7,340 కోట్ల నికర లాభం వచ్చిందని ముంబయికి చెందిన ఈ సంస్థ స్పష్టం చేసింది. తాజా త్రైమాసికంలో ఆదాయంలో 11.4 శాతం వృద్ధి నెలకొని మొత్తం రూ. 38,172 కోట్లు సమకూరిందని నివేదిక వివరించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 34,261 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది స్థిరమైన ఆరంభాన్ని సాధించడం ఆనందంగా ఉందని టీసీఎస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. ప్రథానంగా డిజిటల్ ఆదాయం 32.2 శాతంగా నమోదైందని వివరించారు. ఇందులోనూ 42.1 శాతం వృద్ధి చోటుచేసుకుందన్నారు. కంపెనీలో మొత్తం 12,356 మంది ఉద్యోగులు కొత్తగా చేరారని గడచిన ఐదేళ్ల కాలంలో ఇవే అత్యధిక స్థాయి నియామకాలని వివరించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,36,641కు చేరిందని తెలిపారు. ఒక్కో వాటామీద ఆదాయం 13 శాతం పెరిగి రూ. 21.67కు చేరిందన్నారు. తాజా త్రైమాసికానికి ఒక్కో ఈక్విటీ వాటాకు 5 శాతం డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించిందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రామకృష్ణన్ తెలిపారు.