బిజినెస్

హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ నష్టాలు తప్పాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : గడచిన రెండు రోజులుగా తీవ్ర నష్టాల పాలైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు ఆ పరిస్థితిని అధిగమించాయి. తీవ్ర ఒడిదుడుకులకు గురైన సూచీలు సంతృప్తికర స్థాయిలో స్థిరపడ్డాయి. అయితే బీఎస్‌ఈలో 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 10.25 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేయగా, ఎన్‌ఎస్‌సీ సూచీ నిఫ్టీ మాత్రం 2.70 పాయింట్ల స్వల్ప నష్టాన్ని నమోదు చేయడం విశేషం. మదుపర్లు వేచిచూసే దోరణిని అనుసరించడంతో మంగళవారం మార్కెట్ల పరిస్థితి స్తబ్ధుగా మారిందని విశే్లషకులు భావిస్తున్నారు. సెనె్సక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టర్బో, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సుమారు 378 పాయింట్లు ఎగబాకిన సెనె్సక్స్ తదుపరి అంతే వేగంగా దిగువ చూపులు చూసింది. దీంతో 10.25 పాయింట్ల స్వల్ప ఆధిక్యతతో 0.03 శాతం లాభాలతో ఈ సూచీ 38,435.87 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 2.70 పాయింట్లు కోల్పోయి 0.02 శాతం స్వల్ప నష్టాలతో 11,555.90 పాయింట్ల దిగువన స్థిరపడింది. నిఫ్టీ ఇలా వరుసగా మూడో రోజూ నష్టాల పాలవడం గమనార్హం. ఇంట్రాడేలో ఈ సూచీ ఒక దశలో 11,461.00 పాయింట్ల కనిష్టాన్ని, మరో దశలో 11,582.55 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. కాగా సెనె్సక్స్ ప్యాక్‌లో బజాజ్ ఫైనాన్స్, సన్‌పార్మా, హీరోమోటోకార్ప్, ఎల్ అండ్ టీ, ఆర్‌ఐఎల్, భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా 5.60 శాతం లాభపడ్డాయి. టీసీఎస్ అత్యధికంగా 2.05 శాతం నష్టపోయింది. ఈ సంస్థ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న క్రమంలో నష్టాల పాలవడం విశేషం. ఎస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఏసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ డ్యుయో, కోటక్ బ్యాంక్ 1.88 శాతం నష్టపోయాయి. దేశ ఆర్థికాభివృద్ధి గణాంకాల్లో వాస్తవికత లోపించడంతోబాటు, ఈక్విటీలు ప్రీమియం వాల్యువేషన్‌కు చేరడం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేశాయి. అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందగమనం, వాణిజ్యపరమైన టెన్షన్లు తలెత్తడం వల్ల ఐటీ రంగంలో ఆదాయ మార్గాలు పెరగల్సిన ఈ తరుణంలో అనిశ్చితి నెలకొందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. గడచిన జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్ మిశ్రమ ఫలితాలనే నమోదు చేసే అవకాశాలున్నాయని, ఇందుకు ప్రధాన కారణం ధరల్లో వృద్ధేనని అంటున్నారు. అలాగే ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను వెల్లడించిన ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటన సైతం మార్కెట్లను ప్రభావితం చేయలేదంటున్నారు. అదనపునిధులు, ద్రవ్య లభ్యత తద్వారా జరిగిన రేట్ల కోత ప్రయోజనాలను ఆర్బీఐ గవర్నర్ కూలంకషంగా తెలియజేసినప్పటికీ ఆ అంశాలేవీ మార్కెట్లకు ఊతాన్నివ్వలేదు. ఇలావుండగా రంగాల వారీగా తీసుకుంటే బీఎస్‌ఈలో వినిమయ వస్తువుల సూచీ 6.76 శాతం నష్టాలను సంతరించుకుంది. అలాగే ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, టెక్ సూచీలు సైతం 0.98 శాతం నష్టపోయాయి. మరోవైపు బీఎస్‌ఈలో స్థిరాస్తి, ఆరోగ్య రక్షణ, విద్యుత్, కేపిటల్ గూడ్స్, చమురు, సహజవాయువులు, పారిశ్రామిక రంగాల సూచీలు 2.81 శాతం లాభాలను నమోదు చేశాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ 0.63 శాతం లాభపడ్డాయి. మొత్తం 1,263 వాటాలు నష్టపోగా, 1,178 స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్‌ఈలో మొత్తం టర్నోవర్ రూ. 2,369.85 కోట్లకు చేరింది.
నష్టాల్లో ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్‌సెంగ్, కోస్పి మంగళవారం నష్టాలను నమోదు చేశాయి. నిక్కీ మాత్రం లాభాలతో ముగిసింది. ఇక ఐరోపా మార్కెట్లు కూడా ఆరంభ ట్రేడింగ్‌లో నష్టపోయాయి. అలాగే అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువలో స్తబ్ధత నెలకొని 68.64 రూపాయలుగా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 0.39 శాతం పెరిగి బ్యారెల్ 64.36 డాలర్ల వంతున పలికింది.