బిజినెస్

లక్ష కోట్లు దాటిన జన్ ధన్ అకౌంట్ల డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై)కి మంచి స్పందన లభిస్తోంది. ఇపుడు ఈ జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు ఏకంగా లక్ష కోట్ల రూపాయలు దాటాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం..ఈ జన్ ధన్ పథకాన్ని 36.06 కోట్ల నిధులతో ప్రారంభించగా ఈ ఏడాది జూలై 3వ తేదీ నాటికి మొత్తం అకౌంట్లలో 1,00,495.94 కోట్ల రూపాయల డిపాజిట్లు జమ అయ్యాయి. ఈ పథకం కింద డిపాజిట్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి స్పందన ఎక్కువ అవుతోంది. ఈ ఏడాది జూన్ 6వ తేదీకల్లా 99,694.84 కోట్ల రూపాయలు డిపాజిట్ రూపంలో రాగా, అంతకుముందు వారం ఇది 99,232.71 కోట్ల రూపాయలుగా ఉంది. పీఎంజేడీవైని 2014 ఆగస్టు 28వ తేదీన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రజలందరూ ఒకేవిధమైన బ్యాంకింగ్ సేవలు పొందేందుకు వీలుంది. ఈ పథకం కింద ప్రారంభించే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) అకౌంట్లకు రూపే డెబిట్ కార్డుతోపాటు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కల్పించారు. జీరో బ్యాలెన్స్‌గా ప్రారంభించే పీఎంజేడీవై కింద 2018 మార్చిలో 5.10 కోట్లు ఉన్న డిపాజిట్లు (మొత్తం అకౌంట్లలో 16.22 శాతం) 2019 మార్చి నాటికి 5.07 కోట్లు (మొత్తం అకౌంట్లలో 14.37 శాతం) తగ్గినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 28.44 కోట్ల మంది ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులను అందజేశారు. బీఎస్‌బీడీ అకౌంట్ల కింద కనీస బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన ఏదీ లేదు. దీంతో ఈ పథకం పట్ల ప్రజల్లో ఆదరణ పెరగడంతో 2018 ఆగస్టు 28లోగా జన్ ధన్ అకౌంట్ ప్రారంభించిన ఖాతాదారులందరికీ రెండు లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత అకౌంటు ప్రారంభించిన కొత్త ఖాతాదారులకు లక్ష రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జన్ ధన్ ఖాతాదారులందరికీ 10,000 రూపాయల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. మొత్తం జన్ ధన్ ఖాతాదారుల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు ఉండడం గమనార్హం. పీఎంజేడీవై కింద తక్కువ ఆదాయం కలిగిన వారితోపాటు బలహీనవర్గాల ప్రజలు వివిధ రకాల ఆర్థిక లావాదేవీలైన ప్రాథమిక బ్యాంక్ అకౌంట్, రుణం పొందడం, చెల్లింపులు, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు పొందవచ్చు.