బిజినెస్

మార్కెట్లోకి మరో సూపర్ బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: సూపర్ బైక్‌ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి పొందిన ఇటలీ సంస్థ ‘డుకాటీ’ తన సరికొత్త మల్టీస్ట్రాడా 1200 ఎండ్యూరో మోడల్ బైక్‌ను గురువారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 17.44 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. యూరో-4 ప్రమాణాలతో కూడిన 160 బిహెచ్‌పి ఇంజిన్‌తో ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ రైడింగ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండే ఎండ్యూరో గంటకు 450 కిలోమీటర్లకు మించిన వేగంతో దూసుకెళ్తుంది. 30 లీటర్ల ఇంధన ట్యాంకును కలిగి ఉండే ఈ బైకును క్రూయిజ్ కంట్రోల్, హ్యాండ్స్ ఫ్రీ ఇగ్నిషన్, బ్యాక్ లిట్ హ్యాండిల్‌బార్, ఎల్‌ఇడి కార్నరింగ్ లైట్స్, వెహికల్ హోల్డ్ కంట్రోల్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లతో తీర్చిదిద్దారు. మల్టీస్ట్రాడా 1200, మల్టీస్ట్రాడా 1200ఎస్ మోడళ్లతో ఇప్పటికే లార్జ్ స్పోర్ట్స్ టూరింగ్ మోటార్‌సైకిల్ కేటగిరీలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ‘డుకాటీ’ ఇప్పుడు ఎండ్యూరో మోడల్‌తో వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం భారతీయుల్లో అడ్వెంచర్ మోటార్‌సైక్లింగ్ పట్ల ఆసక్తి ఎంతగానో పెరిగిందని, కనుక మల్టీస్ట్రాడా 1200 ఎండ్యూరో బైక్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఇదే సరైన తరుణంగా భావించామని డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ ఒక ప్రకటనలో తెలిపారు.