బిజినెస్

రుణాల పంపిణీలో 40 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 11: సూక్ష్మ స్థాయిలో ఏర్పాటయ్యే పరిశ్రమలు (కుటీర పరిశ్రమలు), వ్యాపారాలకు అందజేసే రుణాల్లో గడచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయ వృద్ధి చోటుచేసుకుంది. మైక్రో ఫైనాన్స్‌గా వ్యవహరించే ఈ రుణాల్లో 40 శాతం వృద్ధి నెలకొని మొత్తం రూ. 1,27,223 కోట్లకు చేరింది. ఇందులో 10 అగ్రస్థాయి రాష్ట్రాల భాగస్వామ్యం 83 శాతం ఉందని ఎక్వైఫాక్స్, సిడ్బి సంస్థలు సంయుక్తం నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ తరహా రుణ పోర్టుపోలియో 1,27,223 కోట్లు కాగా మార్చి 2019 నాటికి రూ. 1,48,440 కోట్లకు చేరింది. ఈ ప్రాధాన్యతా రంగంలో బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో రూ. 15వేల కోట్లమేర రుణాల పంపిణీ జరిగింది. బీహార్‌లో ఈ రుణాల పంపిణీలో 54 శాతం వృద్ధి చోటుచేసుకోవడం గమనార్హమని సిడ్బీ చైర్మన్ మహమ్మద్ ముస్త్ఫా తెలిపారు. ఈ ఏడాది ఈ సూక్ష్మ స్థాయి రుణాల పంపిణీ ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తాజా రుణాల పంపిణీ సైతం రూ. 213,074 కోట్లు జరిగిందని తెలిపారు. ఈ పంపిణీ కూడా గత ఏడాదితో పోలిస్తే 36 శాతం పెరిగిందని వివరించారు. డిలింక్వెన్సీ రేట్లు 4.74 నుంచి 1.40 శాతానికి గతంలో పోర్ట్‌పోలియో క్లిష్టతర స్థితిని ఎదుర్కొందని, ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చిందని నివేదిక పేర్కొంది. దేశ వ్యాప్తంగా 619 జిల్లాల్లో ఈ సూక్ష్మ స్థాయి పరిశ్రమలు ఉండగా అందులో 30 అగ్రస్థాయి జిల్లాల్లో 25 శాతం రుణాల పంపిణీ జరిగిందని నివేదించింది.