బిజినెస్

ఒడిశాకు ఇపిడిసిఎల్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: విశాఖ నగరంలో రూ.720 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన భూగర్భ విద్యుదీకరణ ప్రాజెక్టు నిర్మాణాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఇపిడిసిఎల్) ప్రతినిధి బృందం దేశంలో పలు రాష్ట్రాల్లో పూర్తయిన ఈ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే కోల్‌కతాలో ఓ కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఈ ప్రతినిధి బృందం పాల్గొంది. ఈ ప్రాజెక్టుకోసం ఉపయోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెళుకవులు, తక్కువ ఖర్చుతో చేపట్టిన పనులు తదితర కీలక అంశాలపైన ఈ బృందం అధ్యయనం చేయగలిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరికొన్ని అంశాలు తెలుసుకోగలిగింది. దీని తరువాత ఈసారి దేశంలో ముఖ్యమైన భువనేశ్వర్, పూరి ప్రాంతాల్లో భూగర్భ విద్యుద్దీకరణ పనులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఈపిడిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సూర్యప్రతాప్, ఏడిఇ విడివి రామకృష్ణ, ఇఇ (సివిల్స్) శ్రీనివాస్ అధికారులతో కూడిన ప్రతినిధి బృందం ఇక్కడ నుంచి బయలుదేరుతోంది. ఆది, సోమవారాల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్, పూరి ప్రాంతాల్లో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. ఇందులోభాగంగా ఈ రెండు ప్రాంతాల్లో ఏ విధంగా ప్రాజెక్టును నిర్వహించారు? దీనికి ఎంతెంత వెచ్చించాల్సి వచ్చింది? ఎన్ని యంత్రాలు, ఎంతమంది కార్మికులను ఉపయోగించారు? ఎన్ని కిలోమీటర్ల మీర నిర్వహించగలిగారు? ఎన్నాళ్ళకు పూర్తయ్యింది? అత్యంత అధునాతన పరిజ్ఖానంతో చేపట్టిన విధానాలేమిటి? వంటి తదితర అంశాలపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. అలాగే అక్కడి అధికారులు నిర్వహించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరికొన్ని అంశాలను పరిశీలిస్తారు. అయితే ఇందులో భువనేశ్వర్‌లో భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్టులు పనులు ఇంకా జరుగుతుండగా, పూరిలో ఆరు మాసాల కిందటే ఈ పనులు పూర్తయ్యాయి. దీనివల్ల విశాఖ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే భూగర్భ విద్యుద్దీకరణ ప్రాజెక్టును ఎటువంటి ఆటంకాలు లేకుండా గడువులోపు నిర్వహించేందుకు వీలుంటుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్‌ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించనున్న భారీ ప్రాజెక్టు అయిన భూగర్భ విద్యుద్దీరకరణ పనుల నిర్మాణానికి సంబంధించి మరో రెండు మాసాల్లో టెండర్ ఖరారు కానుందని, ఆ తరువాత ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. నగరంలోని దాదాపు వంద కిలోమీటర్ల మేర చేపట్టనున్న భూగర్భ విద్యుద్ధీకరణ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నగరంలోని ముఖ్యమైన 23 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తామన్నారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి రెండేళ్ళ కాలంలో పూర్తిచేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.