బిజినెస్

బోనస్ వాటాల జారీపై త్వరలో ఐఓసి నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశంలో అతి పెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) తన వాటాదారులకు బోనస్ షేర్లను జారీ చేసే అంశంపై వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది. బోనస్ షేర్ల జారీ అంశాన్ని పరిశీలించడం కోసం ఐఓసి బోర్డు ఈ నెల 29న సమావేశమవుతుందని ఆ సంస్థ మార్కెట్ రెగ్యులేటరీ అయిన సెబికి పంపిన ఓ లేఖలో తెలిపింది. లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తన మిగులు నిధులను ఉపయోగంలోకి తేవడం కోసం షేర్లను తిరిగి కొనుగోలు చేయడం లేదా, బోనస్ షేర్లను జారీ చేయడం చేయాలని ప్రభుత్వం ఇటీవల ఆ సంస్థలకు లేఖ రాసింది. ఇప్పుడున్న ప్రతి వాటాకు అదనంగా మరో రెండు షేర్లను జారీ చేయాలని గత వారం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఐఓసి 2015-16 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 3,99, 601 కోట్ల అమ్మకాలతో, రూ. 10,399 కోట్ల లాభాలు ఆర్జించిన విషయం తెలిసిందే. కాగా, ఐఓసిలో కేంద్ర ప్రభుత్వానికి 58.28 శాతం వాటా ఉంది.