బిజినెస్

విదేశీ బ్రాండ్‌లను అనుమతించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: రిటైల్ రంగంలో విదేశీ కంపెనీలకు చెందిన బ్రాండ్‌లను ప్రోత్సహించాలన్న ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌గోయల్ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో రిటైల్ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. రిటైల్ రంగాన్ని సుహృద్భావ వాతావరణంలో నిర్వహించాలని భావిస్తున్నామనీ.. ఈ దృష్ట్యా విదేశీ కంపెనీల బ్రాండ్‌లను దేశంలోకి అనుమతించాలన్న ప్రతిపాదనలేవీ కేంద్రం పరిశీలించడం లేదని పేర్కొన్నారు. జాతీయ రిటైల్ ట్రేడ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పారు. రిటైల్ రంగ అభివృద్ధిపై పరిశ్రమలు, వ్యాపార సంఘాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పలు దఫాలుగా చర్చలు జరపాలనుకొంటున్నామని చెప్పారు.
తద్వారా రిటైల్ రంగాన్ని మరింతగా విస్తృతం చేస్తామనీ, ఉన్న సమస్యలపై విధి విధానాలు రూపొందించేందుకు అవసరమైన విలువైన సలహాలు, సూచనలను పై వర్గాల నుంచి తీసుకొని నేషనల్ రిటైల్ ట్రేడ్ పాలసీని రూపొందిస్తామని పేర్కొన్నారు. అలాగే, మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ప్రధాన మంత్రి లఘు వ్యాపారి మాన్‌ధాన్ యోజన పథకం ద్వారా షాప్ కీపర్లు, రిటైల్ వ్యాపారులు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు మూడు వేల రూపాయిల పింఛన్ మంజూరు చేసే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు మంత్రి వివరించారు.