బిజినెస్

విద్యుత్ కార్లదే భవిష్యత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం : విద్యుత్ కార్ల నిర్వహణ ఇపుడిపుడే విజయవంతమవుతోంది. కాలుష్య నియంత్రణకూ ఆస్కారం కలుగుతోంది. మరోపక్క వాహన యజమానులపై పెట్రోల్, డీజిల్ భారం తగ్గుతోంది. సాంకేతికపరమైన సమస్యలనూ అధిగమించడానికి అవకాశం కలుగుతోంది. అయితే ఎటొచ్చీ వీటి నిర్వహణలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని గనక అధిగమిస్తే భవిష్యత్ అంతా విద్యుత్ కార్లదే. ఒకసారి చార్జింగ్ చేసి న విద్యుత్ కారు 80 నుంచి 100 కిలోమీటర్ల వరకే ప్రస్తుతానికి నడుస్తోందని తెలుస్తోంది. సమీపంలో చార్జింగ్ స్టేషన్ ఉండకపోయినా, సమయం లేకపోయినా ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా వీటిని ప్రారంభించిన నాటి నుంచి ప్రభుత్వ అధికారులే ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు. అయతే మధ్యలో నిలిచిపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కనబడడం లేదు. అలాగే చార్జింగ్‌కు కూడా ఎక్కువ సమయం పడుతోంది. ఇటువంటి సమస్యలను అధిగమించగలిగితే భవిష్యత్ అంతా విద్యుత్ కార్లదేనంటూ నిపుణులు చెబుతున్నారు.
ఏపీఈపీడీసీఎల్‌లో 30 విద్యుత్ కార్లు
గత ఏడాది డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో అప్పటి సీఎండీ హెచ్‌వై దొర విద్యుత్ కార్లను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ కార్లు ఈ సంస్థ పరిధిలోనే 30 వరకు నడుస్తున్నాయి. అధికారుల కోసం నిర్వహించే అద్దె కార్లు భారంగా మారడంతో విద్యుత్ కార్ల వైపు యాజమాన్యం దృష్టి సారించింది. 30 కిలోవాట్ల మోటార్ కలిగిని ఈ ఈ-కారు ప్రయాణించడానికి ఒక కిలోమీటర్‌కు సుమారు ఒక రూపాయి ఖర్చవుతుంది. ఆరేళ్ళ నిర్వహించేలా బ్యాటరీకి లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ ఉంటోంది. వీటి కోసం 20 చార్జింగ్ స్టేషన్లు నిర్వహిస్తున్నారు. ఇందులో ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలోనే ఆరు కేంద్రాలున్నాయి. ఆపరేషన్ సర్కిల్ కార్యాలయంలో రెండు, జోన్-2 డివిజన్ ఆఫీసు-1, సింహాచలం స్టోర్-1, సింహాచలం ఎంఆర్‌టీ-1, జోన్-2 డివిజన్ ఆఫీసు, దొండపర్తి సబ్ డివిజన్ ఆఫీస్, వాల్తేరు/సబ్ డివిజన్ ఆఫీస్, డిస్ట్రిబ్యూషన్ సబ్ డివిజన్ ఆఫీస్, 33/11 కేవీ బీహెచ్‌పీవీ సబ్‌స్టేషన్, 33/11 కేవీ బీహెచ్‌పీవీ సబ్‌స్టేషన్, 33/11 కేవీ చినగంట్యాడ సబ్‌స్టేషన్, 33/11కేవీ మల్కాపురం సబ్‌స్టేషన్, 33/11గోపాలపట్నం సబ్‌స్టేషన్, 33/11 కేవీ పెందుర్తి సబ్‌స్టేషన్ వద్ద ఒక్కొక్కటి వంతున చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
నెలకు మూడు వేల కిలోమీటర్లు
ఒక కారు రోజుకు దాదాపు 100 కిలోమీటర్ల మేర వెళ్ళేందుకు వీలు కలిగి చార్జింగ్ ఉంటుంది. ఈ విధంగా నెలకు మూడు వేల కిలోవీటర్ల వరకు అవకాశం ఉంటుందని సంబంధితాధికారి ఒకరు తెలిపారు. డైరెక్ట్ కరెంట్ (డీసీ) ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ ద్వారా అయితే కేవలం గంట వ్యవధిలోనే కారు చార్జింగ్ జరుగుతుందని, అదే ఏసీ చార్జింగ్ స్టేషన్ అంటే గృహ విద్యుత్‌ను ఉపయోగించుకోవడం ద్వారా కారు చార్జింగ్ చేసుకుంటే దాదాపు ఎనిమిది గంటల వరకు సమయం పడుతుందన్నారు. దాదాపు 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నగర పరిధిలోనే వీటి నిర్వహణ ఉన్నందున ఇప్పటి వరకు పెద్దగా సమస్యలు తలెత్తలేదని చెబుతున్నారు. కేటగిరి-2లోకి వచ్చే విద్యుత్ ఒక్కో యూనిట్ కేవలం ఐదు రూపాయల వరకు ఉంటుందని, పది యూనిట్లకు రూ.50ల ఖర్చు ఉంటుందన్నారు. అందువల్ల దీని నిర్వహణతో బహుళ ప్రయోజనాలుంటాయని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సంస్థ పరిధిలోనే 30 విద్యుత్ కార్ల నిర్వహణ ఉండగా, రానున్న రోజుల్లో వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.