బిజినెస్

ఈసారి వృద్ధిరేటు 8 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు దాదాపు 8 శాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. వరుసగా రెండేళ్లపాటు వర్షాభావ పరిస్థితులున్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2015-16) 7.6 శాతం వృద్ధిరేటు నమోదైందని గుర్తుచేసిన ఆయన ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున అంతకుమించి నమోదు కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘గత రెండేళ్ల కంటే వ్యవసాయోత్పత్తి ఈసారి అధికంగా జరగవచ్చని అనుకుంటున్నాం. కాబట్టి పెరిగే వ్యవసాయోత్పత్తి తప్పకుండా దేశ జిడిపిని పరుగులు పెట్టిస్తుంది.’ అని శనివారం ఇక్కడ ‘బ్రిక్స్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్’పై జరిగిన సదస్సుకు హాజరైన దాస్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. కాగా, సార్క్ దేశాల ఆర్థిక మంత్రులు వాణిజ్యం, పన్ను నిరోధక ఒప్పందాలపై దృష్టి పెట్టినట్లు దాస్ చెప్పారు. రెండు రోజులపాటు ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ సార్క్ దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం శుక్రవారం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారత్ తరఫున ఈ సమావేశానికి హాజరు కాలేదు.