బిజినెస్

ఇక స్టాకిస్టులుగా డీలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 22: ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రేషన్ డీలర్ల తొలగింపు విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడింది. గడిచిన నెల రోజులుగా ఆందోళనకు గురవుతున్న డీలర్లు అసెంబ్లీ సాక్షిగా సంబంధిత శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) చేసిన ప్రకటన ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనుంది. ఈ బియ్యాన్ని కొత్తగా నియమితులయ్యే గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా లబ్ధిదారుడి ఇంటికి చేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన నాటి నుండి తమ పరిస్థితి ఏమిటో తెలియక డీలర్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 1977వ సంవత్సరం నుండి ఉన్న రేషన్ డీలర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో రేషన్ డీలర్లు ఆందోళనతో పాటు పోరుబాట పట్టే పరిస్థితులు కూడా వచ్చాయి. తమ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని గతంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నివాసం వద్ద రేషన్ డీలర్లు ఆందోళన చేశారు. తమను కొనసాగించాలంటూ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి తహశీల్దార్లకు వినతి పత్రాలు సైతం అందచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు (నాని) రేషన్ డీలర్ల రద్దు అంశంపై స్పందించారు. రద్దు ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఏ మాత్రం లేదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వారే లేనిపోని దుష్ప్రచారం చేశారన్నారు. రేషన్ డీలర్ల సేవలను స్టాకిస్ట్‌లుగా ఉపయోగించుకుంటామన్నారు. డీలర్ల నుండే వలంటీర్లు నిత్యావసర వస్తువులు తీసుకుని లబ్ధిదారుల ఇంటికి చేర వేస్తారని స్పష్టం చేశారు. మంత్రి కొడాలి ప్రకటనతో రేషన్ డీలర్లు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం మచిలీపట్నంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కోనేరుసెంటరు నుండి కలెక్టరేట్ వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియ చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి ఎ ప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందాడి వెంకట్రావు మాట్లాడుతూ రేషన్ డీలర్ల పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)లకు తమ రేషన్ డీలర్లంతా కృతజ్ఞతులై ఉంటారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకు వచ్చే విధంగా సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాల శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి యంసిహెచ్ కాసిం, కన్వీనర్ పసుపులేటి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.