బిజినెస్

రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని జెన్‌కోలకు వర్తించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలోని విద్యుదుత్పాదక పరిశ్రమ (జన్‌కో)లకు సరికొత్త ‘భద్రతా నిధి చెల్లింపుల’ విధానం వర్తించదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ బుధవారం నాడిక్కడ స్పష్టం చేసింది. ఈ విధానంలో డిస్ట్రిబూషన్ కంపెనీలు విద్యుదుత్పాక పరిశ్రమలకు ‘లెటర్ ఆఫ్ క్రెడిట్’ కింద ముందస్తుగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో కొన్ని విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలకు కేంద్రం ఆమోదం తెలిపిన సందర్భంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త ‘పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం’పై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరడంతో దానిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విద్యుత్ ఉత్పాదక కంపెనీలకు లెటర్ ఆఫ్ క్రెడిట్‌ను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ సొమ్మును తదుపరి జరిగే విద్యుత్ సరఫరాకు హామీగా పరిగణిస్తారు. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. ఐతే గత జూన్ 28న కేంద్ర విడుదల చేసిన ఈ సరికొత్త నిబంధనలను సవరించిన క్రమంలో వాటి పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలోని జెన్‌కోలు రావని తాజా గా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జెన్‌కోల బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని వెల్లడించింది. కాగా స్వతంత్ర విద్యుత్ ఉత్పాదక సంస్థలు కొన్ని ఈ ముందస్తు భద్రతా నిధి విధానాన్ని కోరడం జరిగిందని, ఇందువల్ల బకాయిలు పేరుకుపోయే దుస్థితిని నివారించవచ్చని ఆ సంస్థలు పేర్కొన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న ఈ విధానం ఆ స్వతంత్ర సంస్థలకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ భద్రతా నిధిని నిర్వహించే అధికారం పీపీఏలకు ఉంటుందని తెలిపింది.