బిజినెస్

‘ఐబీసీ’ చట్ట సవరణల్లో మూడు కీలక సరణలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 25: బ్యాంకుల మోసాలు, దివాళా నియంత్రణ చట్టం (ఐబీసీ)కి తలపెట్టిన ఏడు సవరణలు భవిష్యత్‌లో మంచి ఫలితాలిచ్చే అవకాశాలున్నాయని గురువారం నాడిక్కడ విడుదల చేసిన అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ అధ్యయన నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి బ్యాంకులు రుణాలు తీసుకున్న వారిపై మరింతగా అధికారాలను చెలాయించేందుకు దోహదం కలుగుతుందని తెలిపింది. ఈ వారారంభంలోనే కేంద్ర కేబినెట్ ఈ ఏడు సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్యాంకుల మోసాల నియంత్రణ చట్టాన్ని బలోపేతం చేయాలని, అలాగే సానుకూల రుణ మంజూర్ల విధానానికి ఉద్దేశించిన ఈ ఏడు సవరణల్లో ప్రధానంగా మూడు ప్రతిపాదనలు మంచి ఫలితాలనిస్తాయని నివేదిక తెలిపింది. రుణాలు మంజూరు చేసే బ్యాంకులు తదుపరి వసూళ్ల సమయంలోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించే విధంగా నిర్ణయాత్మకంగా వ్యవహరించేందుకు వీలుకలుగుతుందని నివేదిక తెలిపింది. ఇటీవల వెలుడిన కొన్ని అప్పిలేట్ ట్రిబునల్ తీర్పులను ఈ సందర్భంగా ఉదహరించిన మూడీస్ ఎస్‌ఆర్ స్టీల్ కేసులో రక్షణాత్మక రుణ గ్రహీతలను, రక్షణ రహిత రుణ గ్రహీతలను, ప్రస్తుతం రుణం చెల్లిస్తున్న (ఆపరేషనల్) రుణ గ్రహీతలను ఒకే రకంగా పరిగణించడం జరిగిందని, దీంతో బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన అగత్యం ఏర్పడిందని నివేదిక ఉదహరించింది. ఇలాంటి ఎన్‌సీఎల్‌టీ తీర్పులు బ్యాంకులు రుణ వసూలుకు సంబంధించి అనుసరించాల్సిన విధానాలపై స్పష్టతనిస్తాయని తెలిపింది. ఎస్సార్‌ను అతిపెద్ద నిరర్ధక ఆస్తిగా ఎన్‌సీఎల్‌టీ వ్యాఖ్యానించిందని తెలుపుతూ తాజాగా జరిగిన సవరణలతో ఎస్సార్ స్టీల్‌లోని రక్షణాత్మక రుణ గ్రహీతలకు లబ్ధి చేకూర్చవచ్చని తెలిపింది, అలాగే కేసులను ప్రస్తుతం ఉన్న 270 రోజులకు బదులుగా 330 రోజుల్లోగా పరిష్కరించాలన్న వెసులుబాటు కల్పించిన సవసరణ సైతం రుణ బకాయిలను తగ్గించుకునేందుకు బ్యాంకులకు ఉపకరిస్తుందని నివేదిక తెలిపింది. కక్షిదారులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల ఎన్‌సీఎల్‌టీలో కేసులు 270 రోజులకన్నా అలస్యం అవుతాయని నివేదిక తెలిపింది. ఎస్సార్ స్టీల్ కేసు సుమారు 650 రోజులుగా సాగుతుండటాన్ని ఉదాహరణగా చూపింది. కాగా గృహ కొనుగోలుదారులను సైతం రుణ గ్రహీతల జాబితాలోకి చేర్చడం కూడా బ్యాంకుల ప్రగతికి సానుకూల పరిణామని నివేదిక తేల్చింది.