బిజినెస్

భారత్ నుంచి పాకిస్తాన్‌కు రూ. 250 కోట్ల విలువైన వ్యాక్సిన్ల దిగుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జూలై 26: దాదాపు 36 మిలియన్ డాలర్ల విలువైన యాంటీ ర్యాబీస్, యాంటీ వెనోమ్ (విష విరుగుడు) వ్యాక్సిన్లను పాకిస్తాన్ భారత్ నుంచి దిగుమతి చేసుకుంది. దేశానికి అవసరమైన మేర ఈ వ్యాక్సిన్లను తయారీ చేసే సామర్థ్యం స్థానికంగా లేకపోవడం వల్లే పాకిస్తాన్ ఈ వ్యాక్సిన్ల కోసం భారత్‌పై ఆధారపడాల్సి వచ్చిందని శుక్రవారం ఇక్కడ వెలువడిన జాతీయ వార్తాపత్రిక కధనాన్నిబట్టి తెలిసింది. గత 16 నెలల కాలంగా పాకిస్తాన్ మొత్తం రూ. 250 కోట్ల (38 మిలియన్ డాలర్లు) విలువైన యాంటీ ర్యాబీస్, యాంటీ వెనోమ్ వ్యాక్సిన్లను భారత్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు ఆ పత్రిక పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్ జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ గణాంకాలను సెనేట్ స్టాండింగ్ కమిటీకి సమర్పించింది. సెనేటర్ రెహ్మాన్ మాలిక్ భారత్ నుంచి ఏ మేరకు ఔషధాలను దిగుమతి చేసుకుంటున్నారో తెలియజేయాలని కోరడంతో మొత్తం గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ వ్యాక్సిన్లను దేశీయంగానే ఎందుకు తయారు చేసుకోరాదని ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ దేశీయంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్‌తోబాటు మరోప్రైవేటు సంస్థ సైతం యాంటీ ర్యాబీస్, యాంటీ వెనోమ్ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నప్పటికీ దేశ అవసరాలకు సరిపడే మోతాదులో అవిలేవని అందువల్లే భారత్‌లోని అధికారిక వ్యాక్సినేషన్ల తయారీదారుల నుంచి ఈ వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడం జరుగుతోందని తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటన తర్వాత జఠిలంగా మారినా ఈ వ్యాక్సిన్ల దిగుమతి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో అవసరమైన మేర వ్యాక్సిన్ల తయారీని స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకోవాలని సెనేటర్ మాలిక్ సూచించారు.