బిజినెస్

భారీ వర్షాలు.. ఓసీలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూలై 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓసీ గనుల్లో భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఓసీ పని స్థలాల్లో వర్షపు నీరు నిలువడంతో యంత్రాలు నడిచే పరిస్థితి లేక ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. శనివారం కూడా వర్షం ఉండడంతో సుమారు 7వేల టన్నులకు పైగా బొగ్గు రవాణాకు ఆటంకం కలిగింది. భూగర్భ గనుల కన్నా ఓసీ నుండే బొగ్గు ఉత్పత్తి భారీగా ఉంటుంది. వర్షం వల్ల బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణా కూడా నిలిచిపోవడంతో సింగరేణికి కోట్లల్లో నష్టం వాటిల్లనుంది. ఈ వర్షాకాలం సీజన్‌లో ఇదే పెద్ద వర్షాలు కావడంతో ఓసీ గని ప్రాంతంలో భారీగా వరద నీరు చేరి యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి ఉంది. ప్రతి రోజు 3,500 నుండి 4వేల టన్నుల ఉత్పత్తి కావలసివుండగా వర్షం వల్ల రెండు రోజుల్లో 7వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగలేదు. వర్షాలు తగ్గుముఖం పడితేనే తిరిగి ఓసీలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుంది.