బిజినెస్

సైయెంట్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ఇంజినీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ డాటా ఎనలిటిక్స్, నెట్‌వర్క్స్‌లో సైయెంట్ సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ వ్యవస్ధాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బివి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు ఇక్కడ జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1991లో సైయెంట్ ప్రారంభమైందన్నారు. 3 వేల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించామని, 13 వేల మంది అసోసియేట్స్ పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, 25వ వార్షికోత్సవానికి గుర్తుగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒంటరిగా 3,700 కి.మీ దూరం సైకిల్‌పై ఆ సంస్థ అసోసియేట్ విజయ భాస్కరరెడ్డి ప్రయాణించారు. ఇక సిల్వర్‌జూబ్లీ వేడుకల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సంస్థ నిర్వహించింది.

చిత్రం.. 25వ వార్షికోత్సవ వేడుకల్లో సైయెంట్ ప్రతినిధులు