బిజినెస్

ఆటో పరిశ్రమకు మరింత ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: కనె్వన్షనల్ ఇంజన్, విద్యుత్ వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీని భారత ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. ఆటో మొబైల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనివార్యమని, దాని కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఇటీవల ప్రధాని ప్రకటించారు. దీన్ని ఆటో పరిశ్రమ హర్షిస్తోంది. భారత ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్టర్స్ సొసైటీ అధ్యక్షుడు రాజన్ వధేరా బుధవారం ఇక్కడ మాట్లాడుతూ దీని వల్ల పెట్టుబడులకు ప్రోత్సహం అలాగే ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్ సాంకేతికత కోసం దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ఉండాలని ఆయన చెప్పారు. దీని వల్ల పరిశ్రమకు ధీమా వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతి పద్ధతుల ప్రవేశపెట్టాలన్నదే తమ సొసైటీ అభిప్రాయమని ఆయన తెలిపారు. టీవీఎస్ మోటర్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ 3 సంప్రదాయ ఇంధన, విద్యుత్ వాహనాలపై ప్రధాని మోదీ చేసిన ప్రకటన ఆటో పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది. పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక విధంగా ఆటో రంగానికి మేలుజేసేదే2అని స్పష్టం చేశారు. దేశాభి వృద్ధిలో సాంకేతకత కీలక భూమిక పోషిస్తుందని ఆయన అన్నారు.