బిజినెస్

విశాఖ ఉక్కు విజయానికి కన్వర్టర్-1 ఆలంబన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, మార్చి 31: విశాఖ ఉక్కు భవిష్యత్ ప్రణాళికలను విజయవంతంగా అమలుపరుస్తూ కర్మాగారాన్ని ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమని కేంద్ర ఉక్కు మంత్రత్వశాఖ కార్యదర్శి అరుణా సుందర్‌రాజన్ కొనియాడారు. విశాఖకు గురువారం వచ్చిన ఆమె కర్మాగారంలోని పలు విభాగాలను సందర్శించారు. ఎస్‌ఎంఎస్-1లో గల కన్వర్టర్‌ను పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రూ. 384 కోట్లతో ఆధునీకరించిన ఎస్‌ఎంఎస్-1లోని కన్వర్టర్-1 ఉక్కు విజయానికి మరింత ఆలంబనగా నిలుస్తుందన్నారు. 25 సంవత్సరాల పాటు సేవలందించిన కన్వర్టర్‌ను ఆధునీకరణలో భాగంగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పునఃప్రారంభించడం అభినందనీయమన్నారు. అంతకుముందు ఆమె కర్మాగారంలోని కోకో ఓవెన్స్, బ్లాస్ట్‌పర్నేస్-3, వైర్‌రాండ్ మిల్స్‌లో ఉత్పత్తి ఉత్పాదకతల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉక్కు ఇడి వర్కర్స్ కార్యాలయంలోని మోడల్ రూంను సందర్శించారు. అలాగే ఉక్కు డెడికేషన్ పార్కులో మొక్కలు నాటారు. ఉక్కు కర్మాగారం, ఉక్కునగరం పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలోని ముఖ్య నిఘా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారదర్శక విధానాలను అవలంభించేందుకు చేయాల్సిన అవశ్యకతను వివరించారు. ఈ-వేలం, ఈ-టెంటర్లు, ఈ-కామర్స్‌ను ఉపయోగించుకుని సుపరిపాలన అందించవచ్చని సూచించారు. ఉక్కు సిఎండి పి.మధుసూదన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశాఖ ఉక్కు పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు దాసరి నాగేశ్వరరావు, డాక్టర్ జిబిఎస్ ప్రసాద్, టివిఎస్ కృష్ణకుమార్, పిసి మహాపాత్రో, పిఆర్ చౌదరి, సీనియర్ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

చిత్రం విశాఖ ఉక్కు కర్మాగారంలో గురువారం ఎస్‌ఎంఎస్ కన్వర్టర్-1ను
పునఃప్రారంభిస్తున్న ఉక్కు కార్యదర్శి అరుణా సుందరరాజన్