బిజినెస్

ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దేశీయ టెలికామ్ రంగంలో పెను మార్పులకే వేదికవుతోంది. జియోకు చెక్ పెట్టేందుకు టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. తమ 4జి, 3జి మొబైల్ ఇంటర్నెట్ చార్జీలను 80 శాతం వరకు తగ్గించింది మరి. ఇందులో భాగంగానే ఒక గిగాబైట్ (జిబి)ను కేవలం 51 రూపాయలకే అందిస్తోంది. తాజా ప్రత్యేక పథకం ప్రకారం 1,498 రూపాయలతో ఒకసారి రీచార్చ్ చేసుకున్న ఎయిర్‌టెల్ కస్టమర్లకు 51 రూపాయలకే 28 రోజులకుగాను ఒక జిబి 4జి లేదా 3జి మొబైల్ ఇంటర్నెట్ ఏడాది పొడుగునా లభిస్తుందని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలిపింది. సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా 51 రూపాయలు చెల్లించి 1 జిబి 4జి లేదా 3జి మొబైల్ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. ప్రస్తుతం ఇదే డేటాను 28 రోజులకుగాను 259 రూపాయలకు ఎయిర్‌టెల్ అందిస్తుండటం గమనార్హం. ఈ లెక్కన ఏడాది పొడుగునా సేవలకు 3 వేల రూపాయలపైగానే చెల్లించాల్సి వస్తోంది. కానీ తాజా ఆఫర్‌తో ఈ వ్యయం వెయ్యి రూపాయల వరకు కనీసం తగ్గనుంది. వినియోగం పెరిగినకొద్దీ కస్టమర్లకు లాభమే. ఇలాగే 748 రూపాయలతో మరో ఆఫర్‌నూ ఎయిర్‌టెల్ పరిచయం చేసింది. ఆరు నెలలకు వర్తించే ఈ పథకంలో 99 రూపాయలకే 1జిబి 4జి డేటాను పొందవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లు 31 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. జియో దెబ్బకు ఐడియా, వొడాఫోన్ సైతం డేటా చార్జీలను ఇప్పటికే భారీగా తగ్గించినది తెలిసిందే.
ఇదిలావుంటే రిలయన్స్ జియో.. తమ 90 రోజుల ఉచిత అపరిమిత కాల్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని సోనీ, వీడియోకాన్, సాన్‌సూయ్ 4జి స్మార్ట్ఫోన్ కస్టమర్లకూ వర్తింపజేసింది. ఇప్పటికే సామ్‌సంగ్, ఎల్‌జి, మైక్రోమ్యాక్స్, పానసోనిక్, టిసిఎల్, అల్కటెల్, అసూస్ 4జి స్మార్ట్ఫోన్ల కస్టమర్లకు ఈ ఉచిత సేవలు అందుతున్నది తెలిసిందే.