బిజినెస్

రాష్ట్రాల ఆర్థిక మంత్రులనూ అడగండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ఆటోమొబైల్స్‌పై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాలని ఆటో ఇండస్ట్రీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని జీఎస్‌టీ మండలిలో భాగమయిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఆ ఇండస్ట్రీకి సూచించారు. ఆటోమొబైల్స్‌పై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్ అండ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్నారు. దీర్ఘకాలికంగా వాహన పరిశ్రమలో నెలకొన్న మాంద్యం నుంచి బయటపడటానికి జీఎస్‌టీ రేట్‌ను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాహన పరిశ్రమలో మాంద్యం కారణంగా పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కూడా తగ్గిపోయాయి. ‘దేనిపై జీఎస్‌టీని తగ్గించాలన్నా తొలుత ఫిట్‌మెంట్ కమిటీ, తరువాత జీఎస్‌టీ మండలి ఆమోదం అవసరం ఉంటుందనే విషయం మీకు తెలిసిందే. అందువల్ల జీఎస్‌టీ మండలిలో భాగస్వాములయిన రాష్ట్ర ఆర్థిక మంత్రుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసికెళ్లాలని మీ అందరినీ కోరుతున్నాను’ అని ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ సూచన చేశారు. కార్ల తయారీదారులు, డీలర్లు, పరిశ్రమకు సంబంధించిన చాలా మంది భాగస్వాముల నుంచి జీఎస్‌టీని తగ్గించాలనే విజ్ఞప్తి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందిందని ఆయన వెల్లడించారు. ‘వివిధ ఓఈఎంలు (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్లు) దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వారు ఈ అంశాన్ని వారి ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి తీసికెళ్లారా? లేదా?’ అని ఠాకూర్ కార్యక్రమం అనంతరం విడిగా విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఓఈఎంలు లేదా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు కూడా తెలియాలని ఆయన పేర్కొన్నారు.