బిజినెస్

నష్టాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో విభజితమైన, విభజన దశలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో చాలావరకు నష్టాల్లోకొనసాగుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తనిఖీల్లో ప్రభుత్వ రంగసంస్థల డొల్లతనం బయటపడింది. 2015 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 70 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ పరిధిలో ఉన్నాయి. వీటిలో 15 పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి కాగా, మరో 33 విభజన దశలో ఉండగా, 22 పనిచేయడం (విభజనకాలేదు) లేదు. 2014-15లో ఎపి ప్రభుత్వ బడ్జెట్ నుంచి విభజించబడి పని చేస్తున్న సంస్థలకు రూ. 2,266.98 కోట్లు, విభజన దశలో ఉన్న సంస్థలకు రూ.7,117.64 కోట్లు కేటాయించబడింది. మార్చి 31 నాటికి ఈ 70 సంస్థల్లో పెట్టుబడులు రూ,60,708.77 కోట్లుగా ఉన్నట్లు కాగ్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 15 ప్రభుత్వ రంగ సంస్థల్లో తాజాగా నిర్వహించిన లెక్కల ప్రకారం రూ.565.14 కోట్లు నష్టం వాటిలింది. కాగా విభజన దశలో ఉన్న 33 ప్రభుత్వం రంగ సంస్థల్లో రూ.444.12 కోట్లు నష్టాల్లో ఉన్నాయి. మరో నాలుగు సంస్థలు మాత్రం లాభాల్లో ఉండి రూ.16.19 కోట్ల డివిడెంట్లు ప్రకటించినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. అవి ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ, గిడ్డంగుల కార్పొరేషన్, వౌళిక వసతుల కార్పొరేషన్, నీటిపారుదల అభివృద్ధి సంస్థలుగా గుర్తించింది. కాగా సంకీర్ణ ఆంధ్రప్రదేశ్‌లో ఎపిఎస్‌ఆర్టీసి రవాణేతర ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ఖాళీగా ఉన్న సంస్థ భూములను వాణిజ్యపరంగా వినియోగించుకోవాలని తలపెట్టింది. బిఓటి, డిఓటి పథకాల కింద 1998 నుంచి 2001 వరకు పలు చోట్ల భవనాలను నిర్మించి దీర్ఘకాలం గుత్తప్రాతిపదికన కేటాయించింది. ఈ ఒప్పందంలో భాగంగా 2007 నుంచి 2015 వరకు ఆయా సంస్థల నుంచి వసూలు చేయాల్సిన రూ.1.49 కోట్ల సేవా పన్నుకు బిల్లు చేయలేదు. ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎక్కువ స్థలాన్ని కౌలుదారు వినియోగించుకున్నా లైసెన్సు రుసులు 2014-15కి రూ.64.83 లక్షలు తక్కువ బిల్లు చేసినట్లు గమనించామని కాగ్ వెల్లడించింది. డిఓటి పథకం కింద తిరుపతి, విశాఖపట్నం విభాగాల్లో 2012 నుంచి మార్చి 2014 మధ్య రూ.16.24 లక్షల సేవా పన్ను వసూలు చేయలేదని కూడా తెలిపింది. ఇక ఎపి పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆస్తుల విలువ తక్కువ చూపి బీమా చేయుట వల్ల బీమా విలువ రూ.6 కోట్లు ఉన్నప్పటికీ రూ.5.09 కోట్లు వదులుకుని, క్లెయిమ్‌ను రూ.91 లక్షలతో సరిపెట్టుకోవడం తప్పిదంగా కాగ్ పేర్కొంది.