బిజినెస్

బ్యాకింగ్ వ్యవస్థ బలోపేతమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 1: ఆర్థికాభివృద్ధికి మద్దతుగా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ప్రాధాన్యమమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇందుకోసం నియంత్రణ, చట్టాల్లో మార్పులులాంటి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అభివృద్ధికి మద్దతుగా బ్యాకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరంత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు అగ్రతర ప్రాధాన్యత ఇస్తోందని గురువారం ఇక్కడ జాతీయ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఎన్‌బిఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో జైట్లీ చెప్పారు. బ్యాంకుల పూర్తి సామర్థ్యాన్ని వృద్ధికి మద్దతునివ్వడానికే వినియోగిస్తాం తప్ప దిగజారనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి దివాలా సంకేతాలు, రుణ బకాయిల వసూళ్లు, వాటికి సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం, బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చడం, రిజర్వ్ బ్యాంక్ సూచించిన మార్పులు చేర్పులు చేయడం లాంటి ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న పలు చర్యలను జైట్లీ ఉదహరించారు. ఇవే కాకుండా వివిధ రంగాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపైన కూడా ప్రభుత్వం దృష్టిపెట్టిందంటూ ఉక్కు, విద్యుత్, చక్కెర రంగాల్లో తీసుకున్న చర్యలను ఉదహరించారు.
‘గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, భౌతిక వౌలిక సదుపాయాల కల్పనకు నారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ప్రైవేటు రంగంనుంచి కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. ఏ రంగంలో వృద్ధి మందగమనంలో ఉందో ఆయా రంగాలపైన దృష్టిపెడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే మన దేశంలో బ్యాంకింగ్ రంగం పరిస్థితి మెరుగ్గానే ఉంది’ అని జైట్లీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించగా, మన దేశంలో వృద్ధి వేగం మెరుగ్గానే ఉందని కూడా ఆయన చెప్పారు. వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)లు దాదాపు ఏకాభిప్రాయంతో ఆమోదించడం ద్వారా శరవేగంగా సంస్కరణల ప్రక్రియను కొనసాగించడంపై ప్రభుత్వం సామర్థ్యం పట్ల అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ల నోళ్లు మూయించగలిగామని ఆయన తెలిపారు.
ఆర్థిక వృద్ధితో పాటే బీమా విస్తరణ
కాగా, దేశ ఆర్థిక వృద్ధి వేగం పుంజుకోవడంతో భారత దేశం అతి త్వరలోనే పూర్తిస్థాయిలో బీమా కలిగిన సామాజిక భద్రత కలిగిన దేశంగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించే విషయంలో జీవిత బీమా సంస్థ చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని తాను ఆశిస్తున్నానని గురువారం ఇక్కడ దేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ అయిన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) వజ్రోత్సవాలను ప్రారంభిస్తూ జైట్లీ అన్నారు. కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా శుక్రవారం జాతీయ సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలపై జైట్లీ పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ, అన్ని వర్గాలనుంచి వ్యతిరేకత వచ్చిన కారణంగా సామాజిక భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవలసి వచ్చిందన్నారు. అయితే ఏదో ఒక రోజున మనం సామాజిక భద్రత, బీమా ప్రాధాన్యతను గుర్తించగలుగుతామన్న నమ్మకం తనకు ఉందని జైట్లీ చెప్పారు.
ఈ సందర్భంగా ఎల్‌ఐసి చైర్మన్ ఎస్‌కె రాయ్ గత ఆర్థిక సంవత్సరానికిగాను తన మిగులునిధుల్లో యజమాని (ప్రభుత్వ)్భగం కింద రూ. 2502 కోట్ల రూపాయల చెక్‌ను ఆర్థిక మంత్రికి అందజేశారు. అంతేకాకుండా వజ్రోత్సవాల సందర్భంగా పాలసీదార్లకు మామూలుగా ప్రతి ఏటా చెల్లించే బోనస్ కాకుండా ఒన్‌టైమ్ స్పెషల్ బోనస్‌ను చెల్లించనున్నట్లు రాయ్ ప్రకటించారు.

చిత్రం.. ఎన్‌బిఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తున్న అరుణ్ జైట్లీ