బిజినెస్

మదుపరుల సంపద ఆవిరైపోతున్నా పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశ ఆర్థిక పరిస్థితి, ఆటో రంగం కుదేలు కావడంపై బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. ‘వేలాది మంది మనస్తత్వంలో వచ్చిన మార్పుల కారణంగానే ఆటో రంగం కుదేలైందని’ నిర్మలా సీతారామన్.. ‘దేశ ఆర్థిక స్థితిపై ఎవరినైనా ఆరోపించండి కానీ బీజేపీ మాత్రం కచ్చితంగా దీనిని ఎదుర్కొంటుందని’ అభిషేక్ సింఘ్వీ పేర్కొనడంపై కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్‌లో స్పందించింది. కార్లను సొంతం చేసుకోవడం కోసం వాయిదాల పద్ధతిలో వాహనాలను కొనుగోలు చేసి ఓలా, ఊబర్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని అద్దెకు తిప్పుకొంటున్నారని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన అభిషేక్ సింఘ్వీ ‘ఔను ఇది గర్వించదగ్గ అంశం.. ఓటర్లు లేదా ఎవరిపైనైనా ఆరోపణలు చేయండి.. బీజేపీ మాత్రం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది’ అని పేర్కొనడం తెలిసిందే. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ స్పందిస్తూ.. ‘బస్సులు, కార్ల కొనుగోళ్లు సైతం విపరీతంగా పడిపోవడానికి కూడా కారణం ప్రజల్లో వచ్చిన మార్పులే కారణమా?’ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ట్విటర్‌లో ప్రశ్నించింది. ఆర్థిక రంగం విపరీతంగా కుదేలైపోతే దేశం ఏ విధంగా రానున్న ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకొంటుంది.. ఓపక్క యువతకు ఉద్యోగాలు లేవు.. వీటన్నింటికీ ప్రతిపక్షాలదే బాధ్యత అని అనగలరా? ఓలా, ఊబర్ కంపెనీలు అన్ని అంశాలను నాశనం చేశాయని చెప్పగలరా? అని ప్రశ్నించింది. ‘అంతా బాగా జరిగితే అది మావల్లేనని (మోదీనామిక్స్), అనుకొన్న జరగకపోతే ఇతరుల వల్ల జరిగిందని (నిర్మలానమిక్స్) చెప్పుకొంటూ పోతున్నారు.. ప్రజలు మిమ్నల్ని ఎన్నుకొన్నది (పబ్లికానమిక్స్) ఇందుకేనా? చెప్పండి’ అంటూ ట్విటర్‌లో బీజేపీని తీవ్రంగా ప్రశ్నించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలో వంద రోజుల పాలనలో మదుపరులకు చెందిన లక్షల కోట్ల రూపాయిల స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఆవిరైపోయాయని మీడియా గొంతెత్తి చెబుతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని వాపోయింది. ఓపక్క సంపదను సృష్టించే మదుపరులకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితులకు ఏ రకమైన సమాధానం ఇస్తుందని ప్రశ్నించింది. ప్రభుత్వ విధ్వంసకర విధానాల కారణంగా పెట్టుబడిదారుల 12.5 లక్షల కోట్ల రూపాయిల సంపద ఆవిరైపోయిందన్న సంగతిని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ హితవు పలికింది.