బిజినెస్

గత అంచనాలకంటే తక్కువగా భారత జీడీపీ వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 13: ప్రస్తుత అంచనాలకంటే భారత దేశ ఆర్థికాభివృద్ధి రేటు మరింత బలహీనంగా ఉండే అవకాశాలున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ అనిశ్చితి, కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల ఆర్థిక స్థితి ఊగిసలాటను దృష్టిలో ఉంచుకుని తామీ అంచనాలు వెల్లడిస్తున్నట్టు ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5 శాతంగా నమోదైంది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి అని ఐఎంఎఫ్ గుర్తు చేసింది. గత జూలైలో ఈ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్దిరేటు మందగమనాన్ని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గడచిన రెండేళ్ల కాలంలో నెలకొన్న 0.3 శాతం వృద్ధి క్షీణత క్రమంలో స్థూల జాతీయోత్పత్తి 7 నుంచి 7.2 శాతంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఐతే భారత్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థికాభివృద్ధి దేశాల్లో ఒకటని, చైనాకంటే వృద్ధిరేటులో ముందుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. భారత వృద్ధిరేటుకు సంబంధించిన తాజా గణాంకాలను త్వరలో వెలువరిస్తామని వాషింగ్గన్ కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ స్పష్టం చేసింది. ఇదివరకటి ఆంచనాలకంటే తక్కువ స్థాయిలోనే భారత వృద్ధిరేటు గణాంకాలు ఉంటాయని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి జేర్రీ రైస్ గురువారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆ దేశంలోని ఆర్థిక స్థితిని ఐఎంఎఫ్ మానిటర్ చేస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన పేర్కొన్నారు. తయారీ, వ్యవసాయ రంగాల్లో నెలకొన్న వృద్ధిరేటు మందగమనం భారత దేశ జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసిందని రైస్ తెలిపారు.