బిజినెస్

మరో విడత రెపో రేట్ల కోత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 13: ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం కోసం మరో విడత రేట్ల కోతను రిజర్వు బ్యాంకు చేపడుతుందన్న ఊహాగానాలు శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతాన్నిచ్చాయి. దీంతో వాణిజ్య వారం చివరిరోజు సూచీలు మంచి లాభాలను నమోదు చేశాయి. అలాగే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న ఆశాభావంతో అంతర్జాతీయ మార్కెట్లు గణనీయంగా పుంజుకోవడం సైతం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారింది. రూపాయి మారకం విలువ బలపడటం, కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడుల వెల్లువ సైతం వాటాల కొనుగోళ్లను ప్రోత్సహించాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆరంభంలో ఒడిదుడుకులతో సాగిన బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ మధ్యాహ్నం తర్వాత నెలకొన్న కొనుగోళ్ల ఊతంతో లాభాల వైపు పరుగులు పెట్టింది. మొత్తం 280.71 పాయింట్లు ఎగబాకిన ఈ సూచీ 0.76 శాతం లాభాలతో 37,384.99 పాయింట్ల ఎగువన స్థిరపడింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 93.10 పాయింట్ల ఆధిక్యతతో 0.85 శాతం లాభాలను సంతరించుకుని 11,075.90 పాయింట్ల ఎగువన స్థిరపడింది. కాగా ఆగస్టులో రీటెయిల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి పెరిగింది. మరోవైపు పారిశ్రామికోత్పత్తిలో మాందగమనం నెలకొని జూలైలో 4.3 శాతానికి పడిపోయింది. ఈక్రమంలో రిజర్వు బ్యాంకు వచ్చే నెలలో మరోవిడత రెపోరేట్ల కోతను చేపట్టే అవకాశాలున్నాయని వాణిజ్య నిపుణులు అంచనావేస్తున్నారు. కాగా శుక్రవారం సెనె్సక్స్ ప్యాక్‌లో వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా 2.72 శాతం లాభపడ్డాయి. మరోవైపు సన్‌పార్మా, భారతిఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌యూఎల్ అత్యధికంగా 1.41 శాతం నష్టపోయాయి. కాగా అంతర్జాతీయంగా ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అదనపుసానుకూల విధాన నిర్ణయాలు ప్రకటించడం మన దేశీయ మార్కెట్లకూ ప్రోత్సాహకరంగా మారింది. ఈక్రమంలో బీఎస్‌ఈలో చమురు, సహజవాయువులు, ఇంధనం, లోహ, స్ఢిరాస్తి, వినిమయం, బ్యాంకెక్స్, విద్యుత్, వాహన, ఐటీ రంగాలు 2.73 శాతం లాభపడ్డాయి. ఐతే టెలికాం, హెల్త్‌కేర్ రంగాలు 0.94 శాతం నష్టపోయాయి. బ్రాడర్ బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.82 శాతం లాభపడ్డాయి.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోయే అవకాశాలున్నాయన్న కథనాలతో ఆసియా మార్కెట్లు శుక్రవారం లాభాలను నమోదు చేశాయి. ప్రధనంగా హాంగ్‌కాంగ్, జపాన్ మార్కెట్లు అత్యధికంగా లాభపడ్డాయి. అలాగే ఐరోపా మార్కెట్లు సైతం ఆరంభ ట్రేడింగ్‌లో లాభాలనే నమోదు చేశాయి. అక్కడి సెంట్రల్ బ్యాంకు సానుకూల ప్రకటనే ఇందుకు కారణం. కాగా అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు బలపడి ఇంట్రాడేలో 71.07గా ట్రేడైంది. ఇక ముడిచమురు ధర 0.31 శాతం తగ్గిం బ్యారెల్ 60.19 డాలర్ల వంతున ట్రేడైంది.