బిజినెస్

సరకు రవాణాలో రైల్వే ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: దేశ ఆర్థిక రంగంతో పాటు పరిశ్రమలు ముందడుగు వేసేందుకు ముఖ్యంగా సరకు రవాణాదారులకు సహాయ పడేందుకు భారతీయ రైల్వే శాఖ తాజాగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. దూర, దగ్గరి మార్గాల్లో సరకు రవాణా అభివృద్ధికే కాకుండా కంటైనర్ల ద్వారా లోడింగ్‌కు కూడా ఇవి దోహదపడనున్నాయి. వ్యాపార సౌలభ్యం, డిజిటలైజేషన్ కోసం పాన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రైల్వే రిసిట్ కింద గత నెల ఒకటో తేదీ నుంచి ఈటీఆర్‌ఆర్ సౌకర్యం దేశమంతటా అమల్లోకి వచ్చింది. దీన్ని ఉపయోగించడం కోసం కాగిత రహితంగా రైల్వే రశీదు ఎలక్ట్రానిక్ పద్ధతులో వినియోగదారునికి చేరుతోంది. ఈటీఆర్‌ఆర్‌ఈ సరెండర్ చేయగానే సరకు డెలివరీ అవుతుంది. ఇక వినియోగదారులు ఎలాంటి కాగితాలను తమవెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా అక్టోబర్ 1 నుంచి జూన్ 30 మధ్యకాలాన్ని రైళ్ల ద్వారా సరకు రవాణా చేసే రద్దీకాలంగా భావిస్తారు. ఈ కాలంలో బేస్ ఫ్రైట్‌పై 15శాతం సర్‌చార్జి విధిస్తారు. అయితే ప్రస్తుతం ఈ 15శాతం బిజీ సీజన్ సర్‌చార్జిని ఇనుప ఖనిజం, పెట్రోలు, ఆయిల్, లూబ్రికెంట్లపై మళ్లీ ప్రకటించేంత వరకు నిలుపుదల చేశారు. సాధారణంగా దక్షిణ మధ్య రైల్వేలో అత్యధికంగా సిమెంట్, కంకర, బొగ్గు, ఆహార ధాన్యాలు, ఎరువులు రవాణా అవుతుంటాయి. అయితే ఇక అదనపు సరకు రవాణా సాధనకు ఈ సరకులన్నింటిపై సర్‌చార్జీకి మినహాయింపు లభించింది. అలాగే మినీ రేక్‌లు, టూపాయింటర్ రేక్‌లపై ఐదు శాతం సప్లిమెంటర్ చార్జీ మినహాయించారు. దీనివల్ల సిమెంట్, స్టీల్, ఆహార పదార్థాలు, ఎరువులు లోడింగ్ అయ్యే చిన్న కార్గోలకు ప్రయోజనం కలుగుతుంది. న్యూ మోడిఫైడ్ గూడ్స్ కార్ రేక్‌ల ప్రవేశం, కొత్త డిజైన్ల బీసీఏ సీఎంఎం వ్యాగన్ల ప్రవేశం వల్ల మోటారు వెహికల్ ట్రాఫిక్ రవాణా సులభమైంది. 3 వెయిట్ శ్లాబ్‌ల స్థానంలో 4 కొత్త వెయిట్ శ్లాబ్‌లతో రోడ్‌రైలర్ హేతబద్ధీకరణతో ఇతర రవాణా వ్యవస్థలో రైల్వే శాఖ పోటీ పడగలిగే రేట్లు అందుబాటులోకి వచ్చాయి.