బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : విదేశీ మదుపర్లు వాటాలను భారీగా ఉపసంహరించుకుంటున్న తరుణంలో గురువారం ఇంధన, బ్యాంకింగ్ స్టాక్స్‌లో భారీగా వాటాల విక్రయాల వత్తిడి నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పెద్దయెత్తున నష్టపోయాయి. బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ తొలుత ఏకంగా 626 పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత కొంత కోలుకుని 470.41 పాయింట్ల (1.29 శాతం) నష్టాలతో 36,093.47 పాయింట్ల కనిష్ట స్థాయిలో స్థిరపడింది. ఈ సూచీ ఇంట్రాడేలో 35,987.80 పాయింట్ల కనిష్టాన్ని, 36,631.93 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అలాగే బ్రాడర్ ఎన్‌ఎస్‌ఈ సూచీ నీఫ్టీ సైతం 135.85 పాయింట్లు కోల్పోయి 1.25 శాతం నష్టాలతో 10,704.80 పాయింట్ల దిగువన స్థిరపడింది. ప్రధానంగా యెస్ బ్యాంకు వాటాలు 15.52 శాతం నష్టపోయాయి. ఆల్టికో డీపాల్ట్ కారణంగా స్థిరాస్తి రంగంపై రుణాలు అధికంగా ఇచ్చిన బ్యాంకులకు ఇక్కట్లు తప్పకపోవచ్చని అంతర్జాతీయ అధ్యయన సంస్థ మూడీస్ నివేదిక వెలువరించడంతో ఈతరహా రుణాలు అధికంగా ఇచ్చిన యెస్ బ్యాంకుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడి వాటాలు అధికంగా నష్టపోయాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు సైతం ఇలాంటి రుణాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. మొత్తం రుణాల్లో వాణిజ్య స్థిరాస్తి రంగానికి సుమారు 5 శాతం రుణాలను ఆ బ్యాంకులు సైతం ఇస్తున్నాయి. ఈక్రమంలో ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ 3.59 శాతం నష్టాలను సంతరించుకున్నాయి. అలాగే సెనె్సక్స్ ప్యాక్‌లో టాటాస్టీల్, మారుతి, ఎస్‌బీఐ, ఆర్‌ఐఎల్, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్, టీసీఎస్ సైతం 3.66 శాతం నష్టపోయాయి. అదేక్రమంలో టాటామోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్ మాత్రం 1.97 శాతం లాభపడ్డాయి. దేశీయ మార్కెట్ల నుంచి భారీగా పెట్టుబడులు తరలివెళుతుండటం మదుపర్ల సెంటిమెంటుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఈ సందర్భంగా వాణిజ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వు విధాన నిర్ణాయక సమావేశం సందర్భంగా 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోత విధించడంతోబాటు మరోదఫా రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలను సైతం ఇచ్చింది. ఈ పరిణామం ధరలను అదుపుచేయలేని స్థితికి దారితీయవచ్చన్న అంచనాలు వెలువడటం మదుపర్లు ఆచితూచి అడుగేసేలా చేసింది. కాగా బుధవారం నాడు విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు రూ. 959.09 కోట్ల రూపాయల వాటాలను విక్రయించారు. ఇక దేశీయ సంస్థాగత మదుపర్లు రూ. 780.45 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.
పెరిగిన ముడిచమురు ధరలు
సౌదీలో జరిగిన డ్రోన్ దాడుల క్రమంలో నెలకొన్న చమురు ధరల సంక్షోభం ప్రభావం గురువారం కూడా పడింది. ముడిచమురు ధరలు 1.98 శాతం పెరిగి ఇంట్రాడేలో బ్యారెల్ 64.81 డాలర్ల వంతున ట్రేడైంది. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 6 పైసలు కోల్పోయి ఇంట్రాడేలో రూ.71.30గా ట్రేడైంది. ఇక ఆసియా మార్కెట్లలో షాంఘై కాంపోజిట్ సూచీ, నిక్కీ, కోస్పి లాభాలను నమోదు చేయగా, హ్యాంగ్‌సెంగ్ మాత్రం నష్టపోయింది. ఐరోపా స్టాక్ ఎక్చేంజీలు ఆరంభ సెషన్‌లో లాభాలనే నమోదు చేశాయి.