బిజినెస్

విదేశీ పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: గడచిన రెండు నెలల కాలంగా కేవలం వాటాల విక్రయాలకే పరిమితమైన విదేశీ పెట్టుబడిదారులు ప్రస్తుత సెప్టెంబర్ మాసంలో మాత్రం మన దేశీయ మార్కెట్లలో నికర మదుపర్లుగా మారారు. మన ప్రధాన మార్కెట్లలోకి విదేశీయులు మొత్తం రూ.7,714 కోట్ల మొత్తాన్ని పెట్టుబడులుగా జొప్పించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక ఉద్దీపన చర్యలు సత్ఫలితాలివ్వడమే దీనికి కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ పన్నులో 10 శాతం కోత విధించడంతోబాటు, విదేశీ పెట్టుబడులపై సమకూరే వౌలిక లాభాలపై విధించిన అదనపు సుంకాలను అమలు చేయబోవడం లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే కేవైసీ అవసరాల నిబంధనను సైతం సెబీ సరళీకృతం చేసింది. ఈక్రమంలో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ. 7,849.89 కోట్ల మొత్తం ఈక్విటీల్లోకి పెట్టుబడులుగా రాగా రూ. 135.59 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అలాగే రుణ మార్కెట్లలో ఈనెల 3నుంచి 27 వరకు నికరంగా రూ. 7,714.30 కోట్ల మొత్తం విదేశీ పెట్టుబడులుగా వచ్చాయి. అలాగే రూ. 5,0120.02 కోట్ల మొత్తాన్ని ఆగస్టులో ఉపసంహరించుకోవడం జరిగింది. అలాగే జూలైలో రూ. 2,985.88 కోట్ల మొత్తం విదేశీ నిధులు తరలి వెళ్లాయి.